HomeTelugu Trendingఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!

ఈ వారం కచ్చితంగా చూసేయాల్సిన టాప్ OTT releases ఇవే!

Here's the list of must-watch OTT releases this week!
Here’s the list of must-watch OTT releases this week

OTT releases this week:

2024 ముగిసిపోతోంది. ఈ డిసెంబర్ మూడవ వారం మీ ఇంట్లోనే కూర్చుని కొత్తగా వచ్చిన చిత్రాలు, సిరీస్‌లు చూసి సరదాగా గడపండి. ఈ వారం ఏ ప్లాట్‌ఫామ్స్‌లో ఏమేం విడుదల అవుతాయో తెలుసుకుందాం.

Aha;

ఈ వారం ఆహా అందిస్తున్న స్పెషల్ ఎంటర్టైన్‌మెంట్ “జీబ్రా” (తెలుగు సినిమా). డిసెంబర్ 18న ఆహా గోల్డ్ యూజర్లకు ముందుగా విడుదల చేయగా. రెగ్యులర్ యూజర్ల కోసం డిసెంబర్ 20న అందుబాటులోకి రానుంది.

ఈ చిత్రంలో థ్రిల్లింగ్ కథతో పాటు ఆసక్తికరమైన ట్విస్ట్‌లు ఉన్నాయి. చాలా రోజుల తర్వాత మంచి రెస్పాన్స్ అందుకున్న సత్యదేవ్ సినిమా ఇది. థియేటర్లలో అనుకున్నా కలెక్షన్లు రాకపోయినప్పటికీ.. OTT లో ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగానే ఎదురుచూస్తున్నారు.

ETV Win:

ఈటీవీ విన్ తన ఎక్స్‌క్లూజివ్ తెలుగు సినిమాగా “లీలా వినోదం” ని డిసెంబర్ 19న విడుదల చేసింది. కుటుంబంతో కలిసి చూడటానికి అనువైన ఫీల్‌గుడ్ సినిమా ఇది. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ నటించిన సినిమా ఇది.

Sony LIV:

సోనీ లివ్ ఫ్లాట్‌ఫాం “క్యూబికల్స్ సీజన్ 4″ని (హిందీ సిరీస్ తెలుగు డబ్) డిసెంబర్ 20న విడుదల చేస్తోంది. ఇది యూత్ ఇష్టపడే ఆఫీస్ డ్రామా కథ.

ALSO READ: “మా సినిమా తలనొప్పి కలిగించదు” అంటున్న స్టార్ హీరో!

Recent Articles English

Gallery

Recent Articles Telugu