Zebra OTT and Pushpa 2 connection:
ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వంలో సత్యదేవ్ కంచరణ హీరోగా నటించిన జీబ్రా నవంబర్ 2024లో విడుదలై మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమాలో సూర్య (సత్యదేవ్) అనే బ్యాంకు ఉద్యోగి అనుకోకుండా ఒక పెద్ద ఆర్థిక మోసం లోకి గిరికిలిపోతాడు. ఈ కారణంగా ఆ వ్యక్తి జీవితంలో ఎన్నో మలుపులు, సంచలన సంఘటనలు చోటుచేసుకుంటాయి.
తాజాగా జీబ్రా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం డిసెంబర్ 20, 2024న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం కానుంది. ఈ సందర్భంలో, ఓ ఈవెంట్‌లో సత్యదేవ్ మాట్లాడుతూ, “మా సినిమాకు రెండు వారాల థియేటర్ విండో లభించింది. ఆ తర్వాత పుష్ప 2 విడుదలై, థియేటర్ల కొరత తలెత్తింది. అందువల్ల, నాలుగు వారాల తరువాత మా చిత్రం ఓటీటీలోకి వస్తోంది. ఇది సరైన సమయమే,” అని చెప్పారు.
#Zebra Telugu version will premiere on Aha Video on December 20th. pic.twitter.com/pIZfeL0QXC
— GLOBAL OTT (@global_ott) December 17, 2024
తన గత చిత్రం కృష్ణమ్మ గురించి ఆయన ప్రస్తావిస్తూ, “ఆ సినిమా కేవలం ఒక్క వారం తర్వాత ఓటీటీలోకి వచ్చింది. కానీ, జీబ్రా విషయానికొస్తే, నాలుగు వారాల గ్యాప్ తర్వాత విడుదల కావడం మంచిదే అనిపించింది,” అని అభిప్రాయపడ్డారు.
#Pushpa2 OTT streaming update.
Netflix had a 5 weeks deal, according to it, Pushpa 2 will stream on Jan 8th or 9th.#Pushpa2OnNetflix #AlluArjun𓃵 pic.twitter.com/C76QcMHWk1
— ᏰᏗᏝᏗ (@balakoteswar) December 16, 2024
సత్యదేవ్ మాటల ద్వారా పరోక్షంగా పుష్ప 2 కారణంగా జీబ్రా థియేట్రికల్ రన్ తక్కువకాలంలో ముగిసిందని తెలుస్తోంది. అయితే, దీనికి బాధపడకుండా, ఆయన ఓటీటీ విడుదల పట్ల ఆనందం వ్యక్తం చేశారు. జీబ్రాని ఓటీటీ లో ప్రేక్షకులు ఆదరిస్తారు అని నమ్మకం వ్యక్తం చేశారు.
ALSO READ: Zakir Hussain నెట్ వర్త్ ఎంతో తెలుసా?