Pushpa 2: The Rule First Review:
అల్లు అర్జున్ నటించిన Pushpa 2: The Rule ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న 2024న విడుదల కానుంది. పుష్ప: ది రైజ్ తర్వాత ఈ సీక్వెల్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. టీజర్స్, పాటలు, ట్రైలర్ విడుదల తర్వాత అభిమానుల్లో ఆసక్తి ఇంకా పెరిగింది.
ఈ చిత్రం మూడు గంటల 20 నిమిషాల నిడివితో ఉన్నా కూడా ప్రేక్షకులకు అద్భుతమైన కొత్త అనుభూతిని అందించనుంది అని టాక్. యాక్షన్, డ్రామా, ఎమోషన్స్, ప్రేమ సమపాళ్లలో ఉండే ఈ సినిమాను సుకుమార్ మరింత గొప్పగా రూపొందించారు. జాతర ఎపిసోడ్, ఇంటర్వల్ బ్లాక్, క్లైమాక్స్ వంటి హైలైట్ సన్నివేశాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి.
𝐔/𝐀 it is!! #Pushpa2TheRuleOnDec5th pic.twitter.com/jPZuMaRK56
— Allu Arjun (@alluarjun) November 28, 2024
అల్లు అర్జున్ మరోసారి పుష్పరాజ్ పాత్రలో ప్రేక్షకులను మెప్పించనున్నారు. రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో గ్లామర్ ను జత చెయ్యగా, ఫహద్ ఫాసిల్ ప్రతినాయకుడిగా శక్తివంతమైన పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ వంటి సీనియర్ నటుల అద్భుతమైన నటనతో సినిమా మరింత ఆకట్టుకోనుంది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తున్నాయి.
రూ. 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, విడుదలకు ముందే రూ. 1000 కోట్ల ప్రీ-రిలీజ్ బిజినెస్ సాధించి సంచలనం సృష్టించింది. అడ్వాన్స్ బుకింగ్‌పై భారీ ఆశలు ఉన్నాయి. ట్రేడ్ అనలిస్టులు ఈ చిత్రాన్ని భారీ విజయం సాధించే అవకాశముందని అంచనా వేస్తున్నారు.
పుష్ప: ది రైజ్ మిశ్రమ స్పందనతో ప్రారంభమైనా, సూపర్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు పుష్ప 2 ప్రేక్షకుల్లో భారీ ఆశలు రేకెత్తిస్తోంది. ఈ సినిమా మొదటి నుండే అదిరిపోయే టాక్ అందుకుంటుంది అని చెప్పుకోవచ్చు.