HomeTelugu Reviewsసమంత నటించిన Citadel వెబ్ సిరీస్ ఎలా ఉందంటే!

సమంత నటించిన Citadel వెబ్ సిరీస్ ఎలా ఉందంటే!

Here's Samantha starrer Citadel: Hunny Bunny Review
Here’s Samantha starrer Citadel: Hunny Bunny Review

Citadel: Hunny Bunny Review:

హాలీవుడ్ సిటాడెల్ యూనివర్స్‌ లో ఇండియన్ స్పిన్‌ ఆఫ్‌గా వచ్చిన “సిటాడెల్ హనీ బన్నీ” ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాజ్-డీకే రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌ హాలీవుడ్ సిరీస్‌ సిటాడెల్‌కు భారతీయ వెర్షన్ గా భావించవచ్చు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సిరీస్ లో వరుణ్ ధావన్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించారు. భారీ అంచనాల మధ్య ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమ్ అవుతోంది. మరి ఈ సిరీస్ ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూసేద్దామా..

కథ:

1990లలో హనీ అనే ప్రముఖ నటి జీవితంలోకి బన్నీ అనే స్టంట్‌మ్యాన్ ప్రవేశిస్తాడు. వీరిద్దరూ అనుకోని రీతిలో యాక్షన్, మోసాల ప్రపంచంలో చిక్కుకుంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత వీరికి నదియా అనే కూతురు పుడుతుంది, కానీ వీరిద్దరూ అప్పటికే విడిపోయి ఉంటారు. కూతురిని శత్రువుల నుండి రక్షించడానికి వారు తమ విభేదాలను పక్కనబెట్టి ఒకరికి ఒకరు సహకరించాల్సి వస్తుంది. ఈ కథలో విశ్వ, సిటాడెల్, అర్మాడా వంటి మరిన్ని రహస్యాలున్నాయి. ఆ రహస్యాలు ఏంటి? తమ కూతురిని హనీ బన్నీ కాపాడుకోగలిగారా అనేది ఈ వెబ్ సిరీస్ కథ.

నటీనటులు:

సమంత, హనీ పాత్రలో చాలా చక్కగా నటించింది. యాక్షన్ సన్నివేశాల్లో బాగా కనిపించడమే కాకుండా, పాత్రలోని భావోద్వేగాలను కూడా అందంగా ప్రదర్శించింది. సమంత తన నటనతో ఈ పాత్రకు న్యాయం చేసింది. వరుణ్ ధావన్ బన్నీగా తనలోని యాక్షన్ సత్తాను చూపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ కశ్వి మజుందార్ నదియాగా ఎంతో బాగా నటించింది. కే కే మేనన్, సాకిబ్ సలీం, సికందర్ ఖేర్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు:

అమన్ పంత్ సంగీతం కథకి మరింత బలం చేకూర్చింది. కెమెరా పనితనం కూడా చాలా బాగుంది. యాక్షన్ సన్నివేశాలను చాలా బాగా చూపించారు. ఎడిటింగ్ కొంచెం కథను బోర్ కొట్టించేలా ఉంది. కొన్ని అనవసరమైన సన్నివేశాలను తీసేసి ఉంటే ఇంకా బాగుండేది. డైలాగులు కూడా మంచి స్పంకీగా ఉన్నాయి. రాజ్ డీకే కథను నేరేట్ చేసిన విధానం బాగుంది. యాక్షన్, రొమాన్స్, డ్రామా మూడిటిని చాలా బాగా డీల్ చేశారు. కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

*సమంత, వరుణ్ ధావన్‌ల రొమాన్స్ సన్నివేశాలు
*నదియా పాత్ర
*యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ పాయింట్స్:

-భావోద్వేగాలు లేకపోవడం
-పాత్రల అభివృద్ధి
-నాన్ లీనియర్ కథనం

తీర్పు:

Citadel: Hunny Bunny యాక్షన్ లవర్స్ కు మంచి వినోదం ఇస్తుంది. అయితే కథలో భావోద్వేగాలు అంతగా కదిలించలేకపోయాయి. కథాపరంగా కొన్ని మలుపులు ఉన్నప్పటికీ, కొన్ని పాత్రలు నిడివి ఎక్కువగా ఉన్నా కాస్త బోరింగ్ గా ఉంటాయి. రాజ్-డీకే మంచి ప్రయత్నం చేసినా, కథలో డెప్త్ కొంత అసంతృప్తిగా ఉంటుంది. ట్రయాంగిల్ ప్రేమకథతో పాటు యాక్షన్ సన్నివేశాలు మెరుగ్గా ఉంటే మరింత ఆకట్టుకునేది.

ఓవరాల్ గా.. ఈ వెబ్ సిరీస్ ఒకసారి చూసేలా ఉంది. కథ సన్నివేశాలు ఊహకు అందేలా ఉన్నా, యాక్షన్ ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉంటాయి.

రేటింగ్: 2.75/5

ALSO READ: అమెరికా అధ్యక్షుడు Donald Trump జీతం ఎంతో తెలుసా?

Recent Articles English

Gallery

Recent Articles Telugu