Naga Chaitanya Networth:
సంప్రదాయ తెలుగు వివాహం ఘనత
టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల ఈరోజు డిసెంబర్ 4న హైదరాబాద్లోని ప్రసిద్ధ అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ వివాహం సంప్రదాయ తెలుగు పద్ధతుల్లో ఎనిమిది గంటల పాటు వివిధ శాస్త్రోక్త పూజావిధానాలతో జరిగింది.
ఈ వేడుకకు సినీ, రాజకీయ, క్రీడా రంగాల ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు. ఈ క్రమంలో నాగ చైతన్య ఆస్తుల, ఆదాయం వివరాలు వైరల్ అవుతున్నాయి. నాగ చైతన్య టాలీవుడ్‌లో అత్యంత ధనిక నటులలో ఒకరు. ఇక ఆయన ఆస్తి విలువ రూ. 1000 కోట్లకు పైగా ఉండవచ్చని సమాచారం.
అన్నపూర్ణ స్టూడియోస్ వంటి రూ. 200 కోట్ల విలువైన ఆస్తులతో పాటు, వివిధ పెట్టుబడులు ఆయన సంపదలో ప్రధాన భాగం. 2010లో “ఏ మాయ చేసావే” సినిమా ద్వారా సినీ రంగంలో అడుగుపెట్టిన చైతన్య, “మనం”, “మజిలీ”, “లవ్ స్టోరీ” వంటి హిట్ సినిమాల్లో నటించారు. ఒక సినిమా లేదా వెబ్ సిరీస్‌కు ఆయన రూ. 5-10 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటారు. ఇటీవల చై “ధూత” అనే వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చారు.
చైతన్య హైదరాబాద్లో జూబ్లీ హిల్స్‌లో ఉన్న పెద్ద భవంతి లో ఉంటారు. కార్ లు అంటే పిచ్చి ఉన్న చై వద్ద ఉన్న విలాసవంతమైన కార్ల జాబితా పెద్దదే. ఆయన దగ్గర ఉన్న ఖరీదైన కార్లు:
*ఫెరారీ F430
*పోర్షే 911 GT3 RS
*మెర్సిడెస్-బెంజ్ G63 AMG
అంతేకాకుండా, BMW R9T, ట్రయంఫ్ త్రక్స్టన్ R వంటి లగ్జరీ బైక్స్ కూడా చైతన్య వద్ద ఉన్నాయి.
ALSO READ: OTT లోకి వచ్చేసిన మెగా హీరో ఫ్లాప్ మూవీ!