Bigg Boss 8 Telugu Yashmi Remuneration:
Bigg Boss 8 Telugu తుదిదశకు చేరుకుంది. ఈ వారం యష్మి గౌడ ఎలిమినేషన్‌తో అందరికీ పెద్ద షాక్ ఇచ్చింది. అసలు టాప్ 5లో ఉంటుందని భావించిన యష్మి ప్రయాణం 12వ వారంలో ముగిసింది. యష్మి గౌడ, ప్రిత్విరాజ్ శెట్టి, నిఖిల్ మలియక్కల్, ప్రేరణ కంబుం, నబీల్ అఫ్రిదీ నామినేషన్‌లో ఉన్నారు.
ఎలిమినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠభరితంగా జరిగింది. చివరకు పృథ్వి, యష్మి డేంజర్ జోన్‌లో ఉండగా, పృథ్వి సేవ్ అయ్యాడు. యష్మి ఎలిమినేట్ అయ్యింది. యష్మి ఎలిమినేషన్ న్యాయం కాదు అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఆమెకు మిగతా నామినీల కంటే తక్కువ ఓట్లు రావడం నిజమేనా అని ప్రశ్నిస్తున్నారు.
మరోవైపు యష్మి గౌడ బిగ్ బాస్‌లో ఉండడానికి వారానికి సుమారు రూ. 2 లక్షల పారితోషికం అందుకున్నట్టు సమాచారం. 12 వారాలకు రూ. 24 లక్షలు సంపాదించింది. కొంతమంది ఈ మొత్తం వారానికి రూ. 2.5 లక్షలు కూడా అయ్యి ఉంటుందనీ, మొత్తం రూ. 30 లక్షల వరకు చేరొచ్చని అంటున్నారు.
బిగ్ బాస్ ద్వారా సంపాదించిన ఈ ఆదాయం ఆమె టెలివిజన్ సీరియల్స్‌లో పొందిన దానికంటే ఎక్కువ. ఆమె “కృష్ణ ముకుంద మురారి” సీరియల్‌లో నటించడానికి రోజుకు రూ. 15,000 మాత్రమే అందుకుంది. యష్మి బయటకు వెళ్లడంతో ప్రస్తుతం 10 మంది పోటీదారులు ఉన్నారు. ఫైనల్‌కు దగ్గరపడుతున్న ఈ సమయంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఇది కూడా చదవండి: Vijay-Rashmika: ఫైనల్ గా బయటపడిన విజయ్-రష్మిక డేటింగ్ ఫోటో.. పక్కపక్కనే కూర్చుని మరి..!