Bigg Boss 8 Telugu Winner:
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో నిఖిల్ మలయ్యక్కల్ విజేతగా నిలిచారు. మొదటి ఎపిసోడ్ నుంచే అభిమానుల దృష్టిని ఆకర్షించిన నిఖిల్, టైటిల్ ఫేవరైట్‌గా కొనసాగుతూ విజయం సాధించారు. వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ల ప్రవేశం, గౌతమ్ కృష్ణతో ఉన్న తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నప్పటికీ, నిఖిల్ తన కష్టంతో విజేతగా నిలిచారు.
ఈ సీజన్ ప్రత్యేకత ఏమిటంటే, తొలిసారి బిగ్ బాస్ విజేతకు రూ. 55 లక్షల నగదు బహుమతి అందించారు. గత సీజన్లలో ఇది రూ. 50 లక్షలకే పరిమితమైంది. టైటిల్‌తో పాటు, నిఖిల్‌కు రూ. 6.79 లక్షల మార్కెట్ విలువ ఉన్న మారుతీ సుజుకి డిజైర్ కారును బహుమతిగా అందించారు.
కేవలం బహుమతులతోనే కాదు, నిఖిల్ షోలో ఉన్నప్పుడు పొందిన పారితోషికం కూడా విశేషమే. ఆయనకు రోజుకు రూ. 32,143, అంటే వారానికి సుమారు రూ. 2.25 లక్షల పారితోషికం అందిందని సమాచారం.
నిఖిల్ టెలివిజన్ రంగంలో అడుగుపెట్టిన గోరింటాకు సీరియల్ ద్వారా ప్రేక్షకుల గుర్తింపును పొందారు. అక్కడి నుండి బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విజేతగా ఎదగడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి. ఈ విజయం తరువాత, నిఖిల్ భవిష్యత్తులో మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకుంటారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరీ ముఖ్యంగా నిఖిల్ తెలుగు అబ్బాయి కాదు. ఇక్కడ సీరియల్స్ ద్వారా, టీవీ షో లతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నిఖిల్ బిగ్ బాస్ విజేతగా నిలిచి ఇంకా అభిమానులను ఏర్పరుచుకున్నారు.
ALSO READ: Prabhas Spirit సినిమాలో నటిస్తున్న స్టార్ క్యాస్ట్ గురించి షాకింగ్ వివరాలు!