Anant Ambani’s rare watch collection:
ముకేశ్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ 2024లో తన అద్భుతమైన జీవనశైలితో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన వివాహ వేడుకలతో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు.
అనంత్‌కు విలాసవంతమైన జీవన శైలి అంటే ఎంతో ఇష్టం. అతని దగ్గర రూ. 200 కోట్లకు పైగా విలువైన వాచీలు ఉన్నాయి. ఇటీవల తన భార్య రాధికా మర్చంట్‌తో ఒక ఈవెంట్‌కు హాజరైనప్పుడు అతని చేతిలో కనిపించిన రిచర్డ్ మిల్లే RM 52-04 “స్కల్” బ్లూ సఫైర్ వాచీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
ఈ వాచీ ప్రపంచంలోనే అత్యంత అరుదైన వాటిలో ఒకటి. దీన్ని రిచర్డ్ మిల్లే అత్యంత ప్రత్యేకమైన క్లయింట్‌లకు మాత్రమే అందించారు. కేవలం మూడు వాచీలు మాత్రమే ఉత్పత్తి చేశారు. దీని ధర సుమారుగా రూ. 22 కోట్లు ఉంటుంది.
పాటెక్ ఫిలిప్పే, ఆడెమార్స్ పిగ్వెట్, రిచర్డ్ మిల్లే వంటి బ్రాండ్ల విలాసవంతమైన వాచులను ధరిస్తూ అనంత్ తన లగ్జరీ నిలబెట్టుకుంటున్నారు. విలాసవంతమైన వాచీలకున్న క్రేజ్
అనంత్ రిచర్డ్ మిల్లే వాచుతో మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఈ వాచీ అతనికి వాచీల పై ప్రేమను చాటుతోంది.