
Sreeleela Bollywood Debut:
టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల బాలీవుడ్‌లో అడుగు పెట్టి, వరుసగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్నారు. అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తిక్ ఆర్యన్ సరసన నటించనున్న ఈ భామ, ‘ఆశికీ’ ఫ్రాంచైజ్‌లో భాగమయ్యే అవకాశం ఉంది. అంతేకాదు, సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా షాకింగ్ న్యూస్ ఏమిటంటే, శ్రీలీల ఓ పెద్ద బాలీవుడ్ సినిమాను కోల్పోయినట్లు తెలుస్తోంది.
బాలీవుడ్‌లో కొత్తగా అడుగుపెడుతున్న రషా థడానీ, శ్రీలీలను రీప్లేస్ చేసే అవకాశం ఉందట. రషా, రవీనా టాండన్ కూతురుగా బాలీవుడ్‌లో డెబ్యూ చేసి, మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమె నటించిన ‘ఆజాద్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫలితం సాధించలేకపోయినప్పటికీ, ఆమె నటనకు మంచి స్పందన వచ్చింది.
ఇప్పుడు, శ్రీలీలను తప్పించి, ‘పతి పత్ని ఔర్ వో 2’ చిత్రంలో కార్తిక్ సరసన రషాను తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నారని టాక్.
నిజానికి, శ్రీలీల ఇప్పటికే కార్తిక్ ఆర్యన్‌తో మరో రొమాంటిక్ మూవీలో నటిస్తున్నారు. దీంతో మేకర్స్ ‘పతి పత్ని ఔర్ వో 2’ లో కొత్త జోడీని ప్రయత్నించాలనుకుంటున్నారని సమాచారం. “కార్తిక్, శ్రీలీల ఇప్పటికే ఓ సినిమా చేస్తున్నారు. అందుకే, కొత్త జంట ఉండడం ప్రేక్షకులకు ఆసక్తికరంగా అనిపిస్తుంది” అని మిడ్-డేకి ఓ సోర్స్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తపై అధికారిక సమాచారం అందలేదు. మేకర్స్, లుక్ టెస్ట్స్ అనంతరం నిర్ణయం తీసుకుంటారట. శ్రీలీల ఫ్యాన్స్ ఈ వార్త విని నిరాశ చెందుతున్నారు, కానీ ఆమెకు ఇప్పటికే మంచి అవకాశాలు ఉన్నందున భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు రాకపోవని చెప్పలేం.
ALSO READ: MS Dhoni కూతురు జీవా చదువుతున్న స్కూల్ ఫీజు ఎంతో తెలుసా?