
Pawan Kalyan OG:
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’ సినిమా గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. సుజీత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునేలా ఉండబోతుందని ఇప్పటికే హైప్ ఉంది. తాజాగా దీనికి సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం బయటకొచ్చింది.
ఇన్నాళ్లూ ‘OG’ సింగిల్ పార్ట్ మూవీగా ప్లాన్ చేసినట్టు అనిపించింది. కానీ తాజా సమాచారం ప్రకారం, దర్శకుడు సుజీత్, నిర్మాత డీవీవీ దానయ్య ముందుగా సినిమాను రెండు భాగాలుగా రూపొందించాలని భావించారట. అంతేకాదు, ఈ స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌లో టాలెంటెడ్ హీరో అడివి శేష్ కూడా పాల్గొన్నాడని టాక్.
అడివి శేష్ ఈ ప్రాజెక్ట్‌లో అకిరా నందన్‌కు ఇంట్రడక్షన్ ఇవ్వాలని కూడా ప్లాన్ చేశాడట. కానీ పవన్ మాత్రం ఈ ఐడియాను పూర్తిగా రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రామ్ చరణ్ ప్రత్యేక పాత్రలో నటించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.
అయితే పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తన సినిమాల స్పీడును తగ్గించేశాడు. ఇప్పటికే ‘హరి హర వీర మల్లు’ రెండు భాగాలుగా రూపొందుతోంది. ఇప్పుడు ‘OG’ కూడా అదే మార్గంలో వెళితే పవన్ కాల్షీట్లు కుదిరేలా లేవు. దీంతో ‘OG’ రెండు పార్ట్‌లుగా వస్తుందా? లేక ఒక్కటే ఉంటుందా? అనేదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.
ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ మాత్రం ‘OG’ రెండు భాగాలుగా వస్తే అదిరిపోతుందనే అభిప్రాయంతో ఉన్నారు. రామ్ చరణ్ స్పెషల్ అప్పీరియన్స్ నిజమైతే, ఈ ప్రాజెక్ట్‌పై మరింత క్రేజ్ పెరుగడం ఖాయం!