
Why Kalpana died without knowing the truth in Ghajini:
‘ఘజిని’ సినిమా 2008లో విడుదలైనప్పటి నుంచి ఇప్పటికీ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేసే సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా కల్పన (అసిన్) తన ప్రియుడైన సంజయ్ సింఘానియా (ఆమిర్ ఖాన్) అసలు నిజం తెలియకుండానే మరణించడం చాలా మందిని బాధించింది. ఈ విషయంపై దర్శకుడు ఏ.ఆర్. మురుగదాస్ తాజాగా స్పందించారు.
ఘజినిలో సంజయ్ ఓ ధనవంతుడు అని కల్పనకు అసలు తెలియదు. ఆమె తన ప్రేమను ఎంతో నిజాయితీగా చూపిస్తుంది. అయితే, సంజయ్ ఆమెకు తన అసలు రూపాన్ని బయటపెట్టేలోపు ఆమె హత్యకు గురవుతుంది. మురుగదాస్ మాట్లాడుతూ, “కల్పనకు సంజయ్ నిజస్వరూపం తెలిసుంటే, ఆ సంఘటన అంతగా ప్రభావితం చేసేది కాదు. ఆమె మరణంతోనే కథలో ప్రతీకారం మలుపు తిరిగింది” అని చెప్పారు.
సంజయ్ ప్రతీకార దాహానికి ఇది కీలకం
కల్పన మరణాన్ని మురుగదాస్ ప్రేక్షకుల హృదయాల్లో నాటుకునేలా మలిచారు. ఆమె మరణంతో సంజయ్ స్మృతిని కోల్పోయినా, తన జీవితంలో జరిగిన ఘోర అన్యాయాన్ని తట్టుకోలేక ప్రతీకారం తీర్చుకునే దిశగా వెళ్తాడు. “సంజయ్ తన అసలు గురించి కల్పనకు చెప్పలేకపోవడం, ఆ తర్వాత ఆమెను కోల్పోవడం – ఇవే అతనికి బలమైన ఆవేశాన్ని అందించాయి” అని దర్శకుడు చెప్పారు.
ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో వస్తున్న ‘సికందర్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్బంగా ఘజినిలో కల్పన మరణం గురించి ఓ ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు. నటుల వేషధారణ, యాక్షన్ సన్నివేశాల రసూలు గురించి కూడా ఆసక్తికర విషయాలు తెలిపారు.
ALSO READ: షూటింగ్స్ నుండి బ్రేక్ తీసుకుంటున్న Nani.. ఎందుకంటే..