
The Wild Robot OTT:
హాలీవుడ్ అనిమేటెడ్ సైన్స్ ఫిక్షన్ మూవీ The Wild Robot ఇటీవల భారీ హిట్ కొట్టింది. సెప్టెంబర్ 2024లో థియేటర్లలో విడుదలై, అక్టోబర్‌లో భారతదేశానికి వచ్చింది. అప్పటి నుంచి ఈ చిత్రం $330 మిలియన్ కు పైగా వసూలు చేసింది. ఇది ఒస్కార్ రేసులో కూడా ముందువరుసలో ఉంది.
మీరు ఇంకా ఈ అద్భుతమైన యానిమేషన్ మూవీ చూడలేదా? ఇప్పుడు Jio Hotstar (మునుపటి Disney+ Hotstar) లో తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది ఓటిటి ఫ్లాట్‌ఫామ్స్ లో విడుదల కావడంతో ఎక్కువ మంది వీక్షించే అవకాశం వచ్చింది.
చిత్రాన్ని ప్రఖ్యాత దర్శకుడు Chris Sanders తెరకెక్కించగా, DreamWorks Animation నిర్మించింది. Universal Pictures గ్లోబల్‌గా విడుదల చేసింది. సినిమా నిడివి 102 నిమిషాలు, అందులో Kris Bowers సంగీతం అందించాడు. అద్భుతమైన విజువల్స్, ఎమోషనల్ కథతో చిన్నా పెద్దా అందరూ ఎంజాయ్ చేసేలా ఉంది.
కేవలం Jio Hotstar మాత్రమే కాదు, Amazon Prime Video లో కూడా ఇది ఇంగ్లీషులో రెంట్ కు అందుబాటులో ఉంది. అయితే, ఇతర భాషల్లో చూడాలనుకునే వారు Hotstar లో చూడొచ్చు