
Shahid Kapoor Kareena Kapoor reunion:
బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, కరీనా కపూర్ ఖాన్ మధ్య జరిగిన సర్‌ప్రైజ్ రీయూనియన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఐఫా 2025 ప్రెస్ మీట్ సందర్భంగా వీరిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషంగా మాట్లాడుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేపింది.
ఐఫా 2025 ఈసారి రాజస్థాన్‌లోని జైపూర్‌లో గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ వేడుకలో షాహిద్ స్టేజ్‌పై ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనున్నాడు. కరీనా తన తాత రాజ్ కపూర్‌కు ట్రిబ్యూట్ ఇవ్వనున్నారు.
ఈ రీయూనియన్‌పై షాహిద్ మాట్లాడుతూ, “ఇది మాకేమంత ఆశ్చర్యకరమైన విషయం కాదు. మేము స్టేజ్‌పైనే కాదు, ఇతర ఫంక్షన్లలోనూ కలుసుకుంటూనే ఉంటాం. ప్రజలకు ఇది ఆసక్తికరంగా అనిపించిందంటే, అది బాగానే ఉంది” అని చెప్పారు.
షాహిద్, కరీనా గతంలో బాలీవుడ్‌లో హిట్ జోడీగా పేరుపొందారు. ‘ఫిదా’, ‘చుప్ చుప్ కె’, ‘జబ్ వి మెట్’ లాంటి సినిమాల్లో కలిసి నటించారు. అయితే ‘జబ్ వి మెట్’ రిలీజ్‌కు ముందు వీరిద్దరూ విడిపోయారు. ప్రస్తుతం కరీనా, సైఫ్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తల్లి కాగా, షాహిద్, మీరా రాజ్‌పుత్‌ను పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రిగా జీవిస్తున్నారు.
ఒకప్పుడు ఒకరినొకరు అసౌకర్యంగా చూసే ఈ జంట, ఇప్పుడు పిల్లల స్కూల్ ఫంక్షన్లలో లేదా సినీ ఈవెంట్లలో సాధారణంగా కలుస్తున్నారు. ఐఫా 2025లో వీరి స్నేహపూర్వక కలయిక అభిమానులకు సంతోషం కలిగించింది.