
Top 10 Highest Paid South Indian Actresses:
దక్షిణాది సినీ పరిశ్రమలో హీరోలతో పాటు హీరోయిన్ల క్రేజ్, పారితోషికం పెరుగుతోంది. Top 10 Highest Paid South Indian Actresses జాబితా లో రష్మిక రూ. 13 కోట్లు, త్రిష రూ. 12 కోట్లు, నయనతార రూ. 10 కోట్లు అందుకుంటున్నారు.
1. రష్మిక మందన్న – రూ. 13 కోట్లు
View this post on Instagram
‘నేషనల్ క్రష్’గా పేరు తెచ్చుకున్న రష్మిక, ‘పుష్ప 2’, ‘అనిమల్’, ‘ఛావా’ వంటి సినిమాలతో విజయాలను నమోదు చేసింది. ‘సికందర్’లో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తున్న ఆమెకు రూ. 13 కోట్లు పారితోషికంగా లభించిందని సమాచారం.
2. త్రిష కృష్ణన్ – రూ. 10-12 కోట్లు
View this post on Instagram
‘విశ్వంభర’ సినిమాలో త్రిషకు రూ. 12 కోట్లు రెమ్యునరేషన్ దక్కినట్లు తెలుస్తోంది. కోలీవుడ్‌లో తన క్రేజ్‌ను కొనసాగించుకుంటూ, హిట్ సినిమాలతో దూసుకుపోతోంది.
3. నయనతార – రూ. 10 కోట్లు
View this post on Instagram
‘లేడీ సూపర్‌స్టార్’గా పేరొందిన నయనతార, తన బాలీవుడ్ ఎంట్రీ మూవీ ‘జవాన్’కు రూ. 10 కోట్లు అందుకుంది. అంతేకాదు, తన పెళ్లి డాక్యుమెంటరీ హక్కులను రూ. 25 కోట్లకు అమ్మి పెద్ద మొత్తంలో లాభపడింది.
4. సమంత – రూ. 3-8 కోట్లు
View this post on Instagram
సమంత సాధారణంగా రూ. 3-8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అయితే ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్ కోసం ఆమెకు రూ. 10 కోట్లు లభించిందట.
5. అనుష్క శెట్టి – రూ. 6 కోట్లు
View this post on Instagram
‘బాహుబలి 2’ సినిమా తర్వాత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్న అనుష్క, తన తాజా మలయాళ చిత్రం ‘కథనార్’కు రూ. 6 కోట్లు అందుకున్నట్లు సమాచారం.
6. జాన్వీ కపూర్ – రూ. 5-6 కోట్లు
View this post on Instagram
‘దేవర’తో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన జాన్వీ, ఆ సినిమాకు రూ. 5 కోట్లు అందుకుంది. తాజాగా రామ్ చరణ్ సినిమాకు సైన్ చేసి, రూ. 6 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది.
7. సాయిపల్లవి – రూ. 5 కోట్లు
View this post on Instagram
తన సహజసిద్ధమైన నటనతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సాయిపల్లవి, ‘థాండెల్’ మూవీకి రూ. 5 కోట్లు అందుకుంది. అయితే ‘రామాయణ’ సినిమాలో ఆమె పారితోషికం ఏకంగా రూ. 18-20 కోట్ల వరకూ వెళ్లనుందట!
8. తమన్నా – రూ. 4-5 కోట్లు
View this post on Instagram
‘బాహుబలి’, ‘సైరా’ వంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్న తమన్నా, ప్రస్తుతం రూ. 4-5 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటోంది.
9. రకుల్ ప్రీత్ సింగ్ – రూ. 2-5 కోట్లు
View this post on Instagram
హిందీ, తమిళ, తెలుగు సినిమాల్లో బిజీగా ఉన్న రకుల్, పారితోషికంగా రూ. 2-5 కోట్లు తీసుకుంటోంది.
10. పూజా హెగ్డే – రూ. 2.5-7 కోట్లు
View this post on Instagram
‘మహర్షి’, ‘అల వైకుంఠపురములో’ వంటి సినిమాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే, తన రెమ్యునరేషన్‌ను రూ. 2.5-7 కోట్ల మధ్య పెంచుకున్నట్లు టాక్.
దక్షిణాదిలో ఈ హీరోయిన్స్ డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. అంతర్జాతీయంగా క్రేజ్ పెరుగుతున్న కారణంగా, వీరి పారితోషికం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశముంది.