
SSMB29 latest updates:
బాహుబలి తర్వాత ఎస్ ఎస్ రాజమౌళి ఎలాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇక మహేష్ బాబుతో కలిసి చేస్తున్న SSMB 29 మాత్రం అన్ని అంచనాలు తలకిందులు చేసేలా ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్‌లో రాజమౌళి కొన్ని కఠినమైన రూల్స్ పెట్టాడట. అవి హీరోలు, టెక్నీషియన్స్ అంతా పాటించాల్సిందే.
రాజమౌళి సినిమా సెట్స్‌లో చాలా క్రమశిక్షణ ఉంటుంది. SSMB 29 షూటింగ్ హైదరాబాద్లో శరవేగంగా జరుగుతోంది. అయితే రాజమౌళి ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించాడు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సెట్స్‌లో ఎక్కడా కనిపించకుండా చర్యలు తీసుకున్నాడు.
ఎవరైనా వాటర్ తాగాలంటే గాజు బాటిల్స్ వాడాలి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా సహా మొత్తం టీమ్ ఈ రూల్స్ పాటిస్తున్నారు. హాలీవుడ్ నటీనటులు కూడా ఈ ‘నో ప్లాస్టిక్ బాటిల్స్’ నిబంధనను పాటించాల్సిందే.
SSMB 29 భారీ బడ్జెట్ మూవీ. దాదాపు 1000 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ఈ సినిమాకు ఎక్కడైనా దుబారా ఖర్చు తగ్గించాలి అని రాజమౌళి ప్లాన్ చేశాడు. సెట్‌లో రోజుకు 2000 మందికి పైగా పని చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ ప్లాస్టిక్ బాటిల్స్‌లో వాటర్ ఇవ్వడం వల్ల చాలామంది వాటిని అక్కడే పడేసేవారు. ఈ రూల్‌తో 1-2 కోట్లు ఖర్చు తగ్గడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు కూడా తోడైంది.
రాజమౌళి ఈ నిర్ణయం తీసుకోవడానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉంది. ఇది కీరవాణి భార్య వల్లి సూచన అని టాక్. ఆమె వల్లే రాజమౌళి షూటింగ్‌లో క్రమశిక్షణ పాటించేలా చూస్తున్నారని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇప్పుడు మహేష్ బాబు ప్లాస్టిక్ బాటిల్స్ బ్యాన్ నిర్ణయాన్ని ఫాలో అవుతున్నాడు. కానీ గతంలో కూల్ డ్రింక్స్, మసాలా యాడ్స్ చేసినప్పుడు ఆయన ప్లాస్టిక్ బాటిల్స్ & ప్యాకెట్స్ ప్రమోట్ చేశాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఏది ఏమైనా, ఇప్పుడు రాజమౌళి ఈ కొత్త రూల్‌తో ఒక మంచి సందేశం ఇచ్చాడనే చెప్పాలి. ఇకపై మరిన్ని మూవీ సెట్స్‌లో కూడా ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తారేమో చూడాలి!