
Thandel Target Collections:
నాగ చైతన్య కెరీర్‌లో Thandel అత్యంత ఖరీదైన సినిమా. రూ. 90 కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన ఈ చిత్రం మీద అంచనాలు బాగానే ఉన్నాయి. చందూ మొండేటి దర్శకత్వం వహించగా, సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. అయితే నాగ చైతన్య మార్కెట్‌ని మించి ఈ స్థాయిలో ఖర్చు చేయడం కొంత రిస్కీ అన్న మాట.
సినిమా మొత్తం రూ. 90 కోట్లు ఖర్చు చేయగా, రూ. 60 కోట్లు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా సంపాదించారు. ఇది నాగ చైతన్య మార్కెట్‌ని దృష్టిలో ఉంచుకున్నా మంచి రికవరీ అనే చెప్పాలి.
Netflix: రూ. 35 కోట్లు చెల్లించి డిజిటల్ రైట్స్ తీసుకుంది.
సాటిలైట్ రైట్స్: రూ. 10 కోట్ల కు అమ్మేశారు.
ఆడియో రైట్స్: రూ. 7 కోట్ల కు అమ్మినట్లు సమాచారం.
హిందీ డబ్బింగ్ రైట్స్: రూ. 8 కోట్లు కు అమ్మారు.
మిగిలిన రూ. 30 కోట్ల ను థియేట్రికల్ రన్ ద్వారా రాబట్టాలి. గీతా ఆర్ట్స్ ఈ సినిమాను ఇతరులకు అమ్మాలని చూశారు. కానీ, మార్కెట్‌లో భారీ ఆఫర్లు రాలేదు. అందుకే గీతా ఆర్ట్స్ స్వయంగా విడుదల చేయాలని నిర్ణయించుకుంది.
తండేల్ ఫిబ్రవరి 7న విడుదల కానుంది. ఫిబ్రవరి 6న పెయిడ్ ప్రీమియర్లు ఏవి ఉండవు అని నిర్మాత బన్నీ వాస్ క్లారిటీ ఇచ్చారు. మార్నింగ్ షోస్ నుంచే సినిమా ప్రదర్శించనున్నారు.
తండేల్‌కి పెద్ద సినిమాల పోటీ లేదు, కాబట్టి ఓపెనింగ్స్ బాగానే ఉండే అవకాశం ఉంది. కానీ సినిమా సక్సెస్ మొత్తం మౌత్ టాక్ మీదే ఆధారపడి ఉంది. నాగ చైతన్య మార్కెట్ దాటి పెట్టిన బడ్జెట్‌కి రిస్క్ ఎక్కువైనా, హిట్ టాక్ వస్తే రికవరీ సాధ్యమే!