Prabhas Spirit Movie Updates:
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న స్పిరిట్ సినిమా భారీ అంచనాలను తెచ్చుకుంటోంది. ఈ చిత్రం 2026లో విడుదలకు సిద్దమవుతుండగా, వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ మొదలవుతుందని సమాచారం. టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో రూపొందుతోంది.
ఈ చిత్రం కోసం దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రముఖ నటీనటులను ఎంపిక చేస్తుండటం విశేషం. బాలీవుడ్ తారలు సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఈ చిత్రంలో ప్రతినాయక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. మృణాల్ ఠాకూర్‌ను ప్రభాస్‌కు జోడీగా తీసుకునే ప్లాన్ లో ఉన్నారని ఒక నివేదికలో వెల్లడించారు. అదేవిధంగా, దక్షిణ కొరియా నటుడు డాన్ లీ పాత్రపై కూడా చర్చలు జరుగుతున్నాయి.
#Spirit is trending on social media after a news of #MrunalThakur joining this film.
Although this is officially confirmed so you can imagine the craze for this #Prabhas and #SandeepReddyVanga film.
Also features #SaifAliKhan and #KareenaKapoorKhan. pic.twitter.com/1Ztci4NgQH
— Cricket Movie (@DurgeshUpdates) December 14, 2024
ప్రభాస్ ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆయనకు సరిపోయే స్టైల్‌ను వంగ కొత్తగా మలచబోతున్నారు. కాప్-ఆక్షన్ థ్రిల్లర్‌కు విప్లవాత్మక మార్గం చూపే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.
సందీప్ రెడ్డి వంగ తాను నాన్ లినియర్ కథా తీరుతో సినిమాను రూపొందించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్, ప్రీ-ప్రొడక్షన్ పనులు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి. ప్రభాస్‌ను తిరిగి కొత్త అవతారంలో చూడబోతున్నామని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్, కరీనా విలన్ లుగా నెగటివ్ షేడ్ లో సరికొత్త పాత్రల్లో ఉంటారని సమాచారం.