AP New Liquor Policy:
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త మద్యపాన విధానాన్ని ఈ మధ్యనే ప్రకటించింది. ఇది అక్టోబర్ 1వ తేదీ నుండి అమలులోకి వస్తుంది అని కూడా ధ్రువీకరించింది ప్రభుత్వం. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవి మీడియాతో మాట్లాడుతూ.. రాబోయే కొత్త విధానంలో ప్రధాన అంశాలను వెల్లడించారు.
ప్రస్తుత మద్యపాన ధరలు ముఖ్యంగా 3-స్టార్, 4-స్టార్ హోటళ్లలో అధికంగా ఉండడంపై మంత్రి కొల్లు రవి దృష్టి సారించారు. ఇది వైసీపీ ప్రభుత్వం హయాంలో అమలులోకి వచ్చినప్పటికీ, టూరిజం, ఎక్సైజ్ శాఖల మధ్య సమన్వయాన్ని చేసి ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
ప్రభుత్వం త్వరలో కొత్త బ్రాండ్లను ప్రవేశపెట్టాలని, ఇవి ప్రజలకు నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు అందించాలనే లక్ష్యంతో ఉండాలని ప్రతిపాదిస్తోంది. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో స్మార్ట్ మద్యం దుకాణాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మద్యం సిండికేట్లను ఎదుర్కొనేందుకు ప్రాంతీయ కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యంగా 10% లిక్కర్ కాంట్రాక్టులను తాడి కార్మికులకు (కళ్ళు గీత కార్మికులు) ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Read More: Salaar నటుడు ముంబై లో కొన్న ప్రాపర్టీ ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిన బ్రాండ్ల ధరలను మార్కెట్ స్థాయికి తగ్గించే ప్రయత్నం జరుగుతోంది. ఆరు రాష్ట్రాల్లో అమలులో ఉన్న మద్యం విధానాలు, ధరల అధ్యయనంలో ఏపీ రాష్ట్రంలో మద్యం ధరలు దేశంలోనే అత్యధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని సవరించడానికి కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.
మద్యం విధానంపై తుది నిర్ణయం ఈ నెల 18న జరగబోయే క్యాబినెట్ సమావేశంలో తీసుకోనున్నారు.