What is HYDRAA:
HYDRAA ఫుల్ ఫార్మ్ హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ (Hyderabad Disaster Response Authority)
హైదరాబాద్ నగరంలో మాత్రమే కాక ఇప్పుడు తెలంగాణ అంతటా హైడ్రా (HYDRAA) గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఇంకా తెలుసుకోని వారికి చెప్పాలంటే, హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అథారిటీ. ఈ ఏజెన్సీ ప్రధానంగా, నిబంధనలకు విరుద్ధంగా చెరువులు, వాటి పరిసర ప్రాంతాలలో అక్రమ నిర్మాణాలు జరగకుండా కట్టడి చేయడం కోసం పనిచేస్తుంది.
తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఇటీవలే ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఐపిఎస్ అధికారి ఏ వి రంగనాథ్‌ను ఈ బాధ్యతకు ఎంపిక చేశారు. రంగనాథ్ తన నిబద్ధతతో ఈ హైడ్రా ఆపరేషన్లకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఆపరేషన్లు అక్రమ కబ్జాదారులపై, భూకబ్జాదారులపై ప్రభావం చూపుతున్నాయి.
రంగనాథ్ హైడ్రా ప్రధాన బాధ్యత, జలముల పరిసర ప్రాంతాలలో కబ్జా భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడం. ఈ నెలలోనే, రంగనాథ్ హైడ్రా ఆధ్వర్యంలో 150 ఎకరాల భూమిని తిరిగి పొందారు. 140 నిర్మాణాలను, వాటిలో 50 పెద్ద పెద్ద అంతస్తుల భవనాలను కూల్చివేశారు.
హైదరాబాద్ నగరంలోని సుమారు 185 సరస్సుల పరిసర ప్రాంతాలు తిరిగి తీసుకునేందుకు రంగనాథ్ చర్యలు చేపట్టారు. వీటిలో సుమారు 60% సరస్సులు భూకబ్జా చేయబడినవి. ఈ భూములను తిరిగి పొందేందుకు కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించారు.
ఇక్కడితో ఆగకుండా, రంగనాథ్ హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిలో 2 ఏసిపిలు, 6 ఇన్స్పెక్టర్లు, 30 మంది సిబ్బంది ఉంటారు. సాధారణ ప్రజలు కూడా ఇక్కడ భూకబ్జా, జలముల ఆక్రమణలపై ఫిర్యాదులు చేయవచ్చు.