స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నాగ చైతన్యతో విడాకుల తర్వాత సోషల్ మీడియాలో సమంతపై నిత్యం ఏదో ఒక పుకారు వస్తూనే ఉంది. అయితే సమంత మాత్రం తనపై వచ్చే పుకార్లకు స్పందించడం లేదు. అంతేకాదు సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. కొత్తగా ఫోటో షూట్స్, ఇంటర్వ్యూస్ ఇవ్వడం లేదు. దీంతో తాజాగా సమంతకు సంబంధించిన ఓ బిగ్ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కొంత కాలంగా సామ్ చర్మ సంబంధింత సమస్యతో బాధ పడుతోందని, అందుకే ఆమె బయటకు రావడం లేదనేది ఆ వార్త సారాంశం.
దీనిపై తాజాగా సమంత పర్సనల్ మేనేజర్ స్పందించాడు. తాజాగా ఆయన ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. సమంతకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని స్పష్టం చేశాడు. కొంతమంది కావాలనే తప్పులు వార్తలు సృష్టిస్తున్నారని, వారిపై సమంత లీగల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఈ నెలాఖరులో షూటింగ్‌లో పాల్గొనబోతున్నారని చెప్పారు. ఇక సమంత నటించిన యశోద, శాకుంతలం సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.