HomeTelugu Big Storiesవిడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

విడాకుల వార్తలపై క్లారిటీ ఇచ్చిన హేమచంద్ర, శ్రావణ భార్గవి

Hemachandra and Sravana Bha

పాపులర్ సింగర్స్ హేమచంద్ర, శ్రావణ భార్గవి విడిపోతున్నారంటూ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అసలు వీరికి ఏమైంది ఇద్దరూ ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. కెరీర్‌ పరంగా ఇద్దరూ మంచి స్థాయిలో ఉన్నారు. ఎందుకు విడిపోతున్నారంటూ చాలామంది అభిమానులు నిరాశను వ్యక్తం చేశారు. కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వీరిపై కోకొల్లలుగా వార్తలు వస్తున్నా వీరిద్దరూ స్పందించలేదు.

దీంతో కొంతమంది జనాలకు ఆరాటం ఆగక ఇది నిజమేనేమో అంటూ రకరకాల కథనాలు రాసుకొచ్చారు. కొన్నినెలలుగా వీరిద్దరి మధ్య మాటలు లేవని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు తెగ వైరల్‌ అయ్యాయి.

ఇప్పుడు ఈ రూమర్స్‌కు చెక్‌పెడుతూ సింగర్ హేమచంద్ర, శ్రావణ భార్గవి జంట సోషల్ మీడియాలో స్పందించారు. నా సోలో పాటల కంటే అనవసరమైన రూమర్లు ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది. వీటిని నమ్మి జనాలు కూడా సమయం వృధా చేసుకుంటున్నారు అంటూ హేమచంద్ర పోస్ట్ పెట్టారు.

https://www.instagram.com/p/CfWf9wFvSnC/?utm_source=ig_web_copy_link

శ్రావణ భార్గవి స్పందిస్తూ గత కొద్ది రోజుల నుంచి నా యూట్యూబ్ ఛానల్ వ్యూస్, ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ విపరీతంగా పెరిగిపోయారు. సాధారణం కంటే ఇప్పుడు ఎక్కువ వర్క్, సంపాదన దొరుకుతోంది. తప్పో ఒప్పో కానీ మీడియా నాకో వరం అంటూ రాసుకొచ్చారు.

https://www.instagram.com/p/CfWf_-1hvz0/?utm_source=ig_web_copy_link

Recent Articles English

Gallery

Recent Articles Telugu