HomeTelugu Trending'మా' ఎన్నికల ఫలితాలపై హేమ కామెంట్స్‌

‘మా’ ఎన్నికల ఫలితాలపై హేమ కామెంట్స్‌

Hema comments on maa electi
‘మా’ఎన్నికల ఫలితాలపై నటి హేమ తాజాగా స్పందించింది. ఈ రోజు ఉదయం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు(గురువారం) ఉదయం ఆమె విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మను దర్శించుకుని, అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆమె మీడియాలో మాట్లాడుతూ..
దుర్గ‌మ్మ‌ను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. దసరా సంద‌ర్భంగా తాను ప్రతి ఏడాది అమ్మవారిని దర్శించుకుంటానని, ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

ఈ క్రమంలో ఆమె ‘మా’ ఎన్నికల ఫలితాలపై స్పందించారు. రాత్రి గెలిచామని చెప్పి.. ఉదయానికే ఎలా ఓడిపోయామో నాకు తెలియడం లేదని, దానికి కారణం దుర్గమ్మకైనా తెలుసో లేదో అంటూ హేమ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో ఆమె ప్రకాశ్‌ రాజ్‌ ప్యానల్‌ తరపున పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇదే ప్యానల్‌ నుంచి పోటీ చేసిన అనసూయ ఫలితాలపై చేసిన వరుస ట్వీట్‌లు హాట్‌టాపిక్‌గా మారాయి. ఎన్నికలు జరిగిన రోజు అక్టోబర్‌ 10న రాత్రి వీరిద్దరూ గెలిచినట్లు ప్రకటించి.. మరుసటి రోజు వారు ఓడిపోయినట్లు తెలిపారు. దీంతో ‘మా’ ఫలితాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu