HomeTelugu Trending'హలో వరల్డ్‌' ట్రైలర్‌ విడుదల

‘హలో వరల్డ్‌’ ట్రైలర్‌ విడుదల

Hello World Official Traile

వరుస వెబ్‌ సిరీస్‌లతో దూసుకెళ్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ 5’ తాజాగా ‘హలో వరల్డ్‌’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌కు మెగా డాటర్ నిహారిక కొణిదెల కూడా నిర్మాతగా వ్యవహరించారు. పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌పై విభిన్నమైన వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్న ఆమె తాజాగా ఈ సిరీస్‌ను జీ5తో కలిసి నిర్మించారు. ఇంతకుముందు జీ5తో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ సిరీస్‌ను కూడా రూపొందించారు.

8 ఎపిసోడ్లుగా రూపొందిన ‘హలో వరల్డ్‌’ వెబ్‌ సిరీస్‌కి శివసాయి వర్థన్‌ దర్శకత్వం వహించారు. ఆర్యన్‌ రాజేశ్‌, సదా, రామ్‌ నితిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 12 నుంచి స్ట్రీమింగ్‌ కానున్న ఈ సిరీస్‌ ట్రైలర్‌ను ఈ రోజు (ఆగస్టు 6) ప్రముఖ డైరెక్టర్‌ హరీశ్‌ శంకర్‌ విడుదల చేశారు. ఈ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ఈ సిరీస్‌కి పి.కె. దండీ సంగీతం సమకూర్చగా, ఎదురోలు రాజు సినిమాటోగ్రఫీ అందించారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu