నటి హెబ్బా పటేల్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ, అభిమానులను నిత్యం పలకరిస్తుంటుంది. కొన్నాళ్ల కిందట బొద్దుగా తయారై, ఇటీవల ఎంతో నాజూకుగా కనిపిస్తున్న హెబ్బా తాజాగా ఫ్యాన్స్ తో సోషల్ మీడియా చిట్ చాట్ నిర్వహించింది.
“మీ బ్యూటీ సీక్రెట్ ఏంటి?” అని ఓ అభిమాని అడగ్గా… “అదో పెద్ద సీక్రెట్” అంటూ జవాబిచ్చింది. ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదని పేర్కొంది. తన అందం కొంత దేవుడు ఇస్తే, మరికొంత డాక్టర్ల చలవ వల్ల వచ్చిందని వెల్లడించింది. తద్వారా బ్యూటీ సర్జరీలు చేయించుకున్న విషయాన్ని హెబ్బా పరోక్షంగా తెలియజేసింది. ప్రస్తుతం హెబ్బా పటేల్ ఓదెల రైల్వే స్టేషన్, తెలిసినవాళ్లు అనే చిత్రాల్లో నటిస్తోంది. తనకు మంచి బ్రేక్ వస్తే మళ్లీ మెయిన్ స్ట్రీమ్ లోకి వచ్చేస్తానని ఈ ముంబయి భామ ఆశాభావంతో ఉంది.