హెబ్బా పటేల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బ్లాక్ అండ్ వైట్. ఎన్‌ఎల్‌వీ సూర్య ప్రకాశ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ టీజర్ మంచి స్పందన వచ్చింది. తాజాగా మేకర్స్ బ్లాక్ అండ్ వైట్ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి అజయ్ అరసద మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏ మేఘనా రెడ్డి సమర్పణలో వస్తున్న ఈ మూవీలో సూర్య శ్రీనివాస్ లహరి శారీ, నవీన్ నేని కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. హెబ్బా పటేల్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. శాసనసభ చిత్రంలో స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. దీంతోపాటు తెలిసినవాళ్లు, గీత, వల్లన్, ఆద్య చిత్రాల్లో నటిస్తోంది హెబ్బా పటేల్.