తమిళ ప్రముఖ నటుడు విజయ్ ఆంటోని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హత్య’. టైటిల్, ఫస్టులుక్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని రేకెత్తించాడు. బాలాజీ కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో విజయ్ డిటెక్టివ్ గా కనిపించనున్నాడు. ఈ నెల 21న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం, ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ‘జీవితంలో ఎక్కడ గెలిచినా చావు దగ్గర ఓడిపోవలసిందే’ అనే డైలాగ్ తో ఈ ట్రైలర్ మొదలవుతోంది.
లైలా అనే ఒక మోడల్ హత్య చుట్టూ ఈ కథ తిరుగుతుందనీ .. ఈ మర్డర్ మిస్టరీని ఛేదించడానికి హీరో రంగంలోకి దిగుతాడనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాలో రితిక సింగ్ – మీనాక్షి చౌదరి హీరోయిన్‌లుగా నటిస్తుండగా..మురళీశర్మ .. రాధిక శరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. విజయ్ ఆంటోని నటించిన బిచ్చగాడు-2 ఇటీవలే విడుదలై.. మిశ్రమ టాక్‌ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే.