‘బిచ్చగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. విజయ్ ఆంటోనీ పాప్యులర్ అయ్యాడు. అప్పటి నుంచి ఆయన తమిళంలో చేసిన ప్రతి సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా పలకరిస్తోంది. ‘బిచ్చగాడు’ తరువాత ఆయన చాలా ప్రయోగాలు చేశాడు. ఆ సినిమాను దాటి మిగతా సినిమాలు ఆడలేదు. ఆయనకి ఆ స్థాయి పేరును తీసుకుని రాలేదు.
ఆయన హీరోగా తమిళంలో ‘కొలై’ రూపొందింది. లోటస్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమాకి ‘హత్య’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. మోషన్ పోస్టర్ తోనే సినిమాపై ఆసక్తిని పెంచారని చెప్పచ్చు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.