తెలుగులో ‘నా ఇష్టం, అనామిక, అవును, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, తకిట తకిట’ లాంటి సినిమాల్లో మంచి పాత్రలు చేసి మెప్పించిన హీరో హర్షవర్ధన్ రానే ఆ తర్వాత హిందీ పరిశ్రమలో బిజీ అయ్యాడు. అక్కడే నటి కిమ్ శర్మను ప్రేమించి, కొన్నాళ్ళు డేటింగ్ కూడా చేశాడు. అప్పట్లో వీరి రిలేషన్ కొంచెం హాట్ టాపిక్ అయింది కూడా. కానీ తాజాగా ఆమెతో విడిపోయినట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపాడు హర్షవర్ధన్. అంతేకాదు కిమ్ శర్మను ఉద్దేశించి కృతజ్ఞతలు చెబుతూ నీకు, నాకు దేవుడి ఆశీస్సులు ఉంటాయంటూ పోస్ట్ పెట్టాడు.