Harom Hara review and rating:-ఎన్నో సంవత్సరాల నుంచి సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు సుదీర్ బాబు. మరి ఈ హీరో హరోం హర సినిమాతో విజయం సాధించారా లేదా అనేది చూద్దాం..
కథ:- ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు సరిహద్దులు కలిసే చోట ఉన్న ఒక అందమైన ఊరు కుప్పం. ఆ ఊరు మొత్తాన్ని తిమ్మారెడ్డి.. ఆయన తమ్ముడు బసవ(రవి కాలె), కుమారుడు శరత్ రెడ్డి(అర్జున్ గౌడ) తమ గుప్పెట్లో పెట్టుకో ఉంటారు. అక్కడ వాళ్ళ మాటలకు ఎదురు తిరిగే ధైర్యం ఎవరికీ ఉండదు. అదే సమయంలో అదే ఊరిలో బతకడానికి వేరే ఊరు నుంచి.. వస్తాడు సుబ్రహ్మణ్యం(సుధీర్ బాబు). కుప్పం పాలిటెక్నిక్ కాలేజీలో మెకానికల్ ల్యాబ్ అసిస్టెంట్ గా సుబ్రహ్మణ్యం పని చేస్తూ ఉండగా.. ఒకరోజు శరత్ రెడ్డి మనిషితో గొడవ అయ్యి కాలేజీ నుంచి సస్పెండ్ చేయబడతాడు. అదే సమయంలో తాను ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో.. తనకు స్నేహితుడైన సస్పెండెడ్ కానిస్టేబుల్ పళని స్వామి(సునీల్) దగ్గర ఒక తుపాకీ చూస్తాడు. ఆ తుపాకీతో పాటు.. ఒక బ్లూ ప్రింట్ కూడా సుబ్రహ్మణ్యం కి.. దొరకడంతో తనకున్న మెకానికల్ తెలివితేటలతో తాను ఎందుకు గన్ తయారు చేయకూడదు అనే ఆలోచనతో గన్ తయారీ చెయ్యడం మొదలు పెడతాడు. అలా గన్ తయారీ మొదలుపెట్టిన సుబ్రహ్మణ్యం అదే ఊరిలో తన ఉద్యోగం పోవడానికి కారణమైన.. శరత్ రెడ్డితో అసలు ఎందుకు చేతులు కలిపాడు? ఊరు మొత్తం అసహ్యించుకునే శరత్ రెడ్డితో అసలు సుబ్రహ్మణ్యం కలవాల్సిన అవసరం వచ్చింది? చివరికి సుబ్రహ్మణ్యం ఏం చేశాడు? ఊరు మొత్తం అసహ్యించుకునే.. శరత్ రెడ్డితో చేతులు కలిపిన సుబ్రహ్మణ్యం.. ఆ ఊరు మొత్తానికి దేవుడు ఎలా అయ్యాడు? అనే విషయాలు సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పర్ఫామెన్స్, టెక్నికల్ సిబ్బంది పనితీరు:- యాక్షన్స్ సన్నివేశాల్లో చాలా బాగా నటించాడు సుదీర్ బాబు. సుధీర్ బాబు నటన చాలా ఈజ్ తో చేసినట్లు ఉంది. కుప్పం యాసను కూడా ఈ హీరో భలే పట్టేశాడు. ఆయనకు జోడీగా నటించిన మాళవిక శర్మ కూడా ఏమాత్రం తగ్గకుండా నటించింది. మాళవిక పాత్ర కూడా ఈ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయ్యింది. జయప్రకాశ్ సహా రవి కాలే, అర్జున్ గౌడ వంటి వాళ్లు.. తమదైన నటనతో ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. సునీల్ కి చాలా కాలం తర్వాత మళ్లీ ఒక మంచి రోల్ పడింది. ఉన్నంతలో సునీల్ బాగా నటించి ఆకట్టుకున్నాడు. ఇక మిగతా పాత్రల పాత్రధారులు తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించాడు.
సినిమా టెక్నికల్ అంశాల విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అలాగే 1980లనాటి కుప్పాన్ని మళ్లీ రీ క్రియేట్ చేసిన ఆర్ట్ టీం కృషి సినిమాలో బాగా కనిపిస్తుంది. మ్యూజిక్ పర్వాలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఎడిటింగ్ మరింత బాగుంటే ఇంకొంచెం బాగుండేది.
https://x.com/klapboardpost/status/1801193471296028740
విశ్లేషణ..
హీరో తుపాకులు తయారు చేయడం, ఆ నేపధ్యంలో అతడికి ఎదురైన సమస్యలు చూపించడం.. ఈ చిత్రం మెయిన్ స్టోరీ. అయితే ఆ పాయింట్ లోకి వెళ్ళడానికి దర్శకుడు చాలా సమయం తీసుకున్నారు. సినిమా చాలా సేపటి వరకు అసలు పాయింట్ మొదలవ్వదు. హీరో పాత్ర చుట్టూ ఎదో అద్భుతమైన ఫ్లాష్ బ్యాక్ వుందనే విధంగా మాతికి ఎలివేషన్స్ ఇస్తూ వుంటారు. ఫైనల్ గా ఇంటర్వెల్ బ్యాంగ్ లో అలాంటి ఎలివేషన్ రివిల్ అయ్యే ఓ సిట్యువేషన్ క్రియేట్ అవుతుంది. అలాంటిది ఏదైనా వున్నా కొంచెం బెటర్ గా వుండేది. కానీ మళ్ళీ బాషా సినిమాతో పోలికని భావించారేమో.. సడన్ గా తండ్రి పాత్రని.. ప్రవేశపెట్టి బలవంతంగా ఎమోషన్ ని పిండే ప్రయత్నం దర్శకుడు చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా అదే రొటీన్ రైటింగ్ కనిపిస్తుంది. ఛత్రపతి, పుష్ప సినిమాని గుర్తు చేస్తూ ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ తీశారు. సెకండ్ హాఫ్ రన్ టైం ని ఇంకా సాగదీశారు. చివరి ముఫ్ఫై నిమిషాలైతే చాలా సాదీతగా అనిపిస్తుంది. విక్రమ్ కేజీఎఫ్ స్టయిల్ లో ఏదో యాక్షన్ సీన్స్ వస్తుంటుంది కానీ అందులో ఎమోషన్ ఆడియన్ కి కనెక్ట్ అవ్వదు. దీనికి ముఖ్య కారణం హీరో విలన్ కి మధ్య బలమైన సంఘర్షణ లేకపోవడమే. మధ్యలో `జ్యోతిలక్ష్మి` సీన్ ఒకటి సెకండాఫ్‌ని కాపాడింది. అంతకుమించి సెకండ్ హాఫ్ లో చెప్పుకోదగింది ఏమీ లేదు. ఇలాంటి మరో రెండు మూడు ఉండి, వాటి చుట్టూ బలమైన ఎమోషన్ మిక్స్ చేస్తే, `హరోం హర` టార్గెట్ రీచ్ అయ్యేది. కానీ అసలు అలా చేయాలని కూడా దర్శకుడు ప్రయత్నించలేదు.
బ్యాక్ డ్రాప్ కొత్తగా ఉండడం మాత్రమే ఈ సినిమా ప్లస్ పాయింట్. కథనం రొటీన్‌గా ఉన్నా.. చివరివరకూ చూసేలా చేసింది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్. తెరపై ఓ రొటీన్ సీన్ నడుస్తున్నా.. ఏదో జరుగుతుందనే ఆసక్తిని తన మ్యూజిక్ తో బిల్డ్ చేయగలిగాడు.
ఓక ఇప్పటివరకూ సుధీర్ కి ఇంత మాస్ యాక్షన్ సినిమా లేకపోవడంతో హరోం హర.. తనకి శ్రుతిమించిన డోస్ ఏమో అనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలగక మానదు. ఎమోషనల్ సీన్స్ తన నటన సెటిల్డ్ గా వుంది. అంతేకాకుండా మాళవిక ప్రేమకథలో స్పష్టత కొరవడింది. సునీల్ కి నిడివి వున్న పాత్రే దక్కింది కానీ ఆ పాత్రని తీర్చిద్దిన తీరు రొటీన్ గా వుంది. సుబ్రమణ్యేశ్వర స్వామి వాహనం నెమలి. దాన్ని కొన్ని షాట్లలో సింబాలిక్‌గా వాడుకొన్న విధానం బాగుంది. అయితే కథ కథనాలు విషయంలో దర్శకుడు ఇంకా బలంగా వర్క్ చేయాల్సింది.
తీర్పు:- అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు బాగున్న.. మొత్తం పైన మాత్రం ఈ సినిమాలో ఏదో లోపించింది. ఎడిటింగ్ మరింత బాగుంది.. కథ పైన మరింత కాన్సెంట్రేట్ చేసుంటే సినిమాకు.. మంచి విజయం వచ్చిందేమో.
హరోం హర..అర కొరగ సాగిన కథ
రేటింగ్: 2/5