Harom Hara OTT:
నవ దళపతి సుధీర్ బాబు హీరోగా.. జ్ఞాన సాగర ద్వారక దర్శకత్వంలో నటించిన సినిమా హరోం హర. మాళవిక శర్మ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. జూన్ 14వ తేదీన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కానీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కలెక్షన్లు కూడా అంతంత మాత్రంగానే మిగిలిపోయాయి.
అయితే ఈనెల 11వ తేదీన ఆహా , ఈటీవీ విన్ యాప్ లలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కి రావాలి. కానీ రాలేదు. చిత్ర బృందం కూడా దీని గురించి సైలెంట్ గానే ఉంది. సాంకేతికలోపం వల్ల సినిమా స్ట్రీమింగ్ అవ్వలేదు అని కొన్ని వార్తలు వినిపించాయి. మరోవైపు యూట్యూబర్ ప్రణీత్ హనుమంత్ మీద నడుస్తున్న వివాదం వల్లే ఓటీటీ స్ట్రీమింగ్ ఆగిపోయిందని కూడా టాక్ ఉంది.
తాజాగా ఇప్పుడు హరోం హర చిత్రాన్ని జూలై 18వ తేదీన స్ట్రీమింగ్‍కు తీసుకురానున్నట్టు ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించి పోస్టర్ కూడా విడుదల చేసింది. వచ్చే వారం జూలై 18న ఈ సినిమా ఈటీవీ విన్‍లోకి రానుంది.
హరోం హర చిత్రం స్ట్రీమింగ్ హక్కులు ఆహా ఓటీటీ కూడా తీసుకుంది. జూలై 11న రావాల్సిన సినిమా రాలేదు. మరి సినిమా స్ట్రీమింగ్ గురించి ఆహా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. త్వరలోనే ఆహా లో కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది.
హరోం హర సినిమా ఓటీటీ వాయిదా వాయిదా కి యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు కారణమని తెలుస్తోంది. హరోం హర చిత్రంలో ప్రణీత్ హనుమంతు ఓ చిన్న పాత్ర చేశాడు. కానీ సినిమాలో అతడికి ఛాన్స్ ఇచ్చినందుకు అసహ్యంగా ఉందని సుధీర్ బాబు కూడా ఓ ట్వీట్ చేశారు. అందుకే హరోం హర చిత్రంలో ప్రణీత్ ఉన్న సీన్లను కట్ చేసి ఓటీటీలోకి విడుదల చేయాలి అని మూవీ యూనిట్ నిర్ణయించుకుంది. అందుకే స్ట్రీమింగ్ ఆలస్యమైంది అని టాక్ నడుస్తోంది.