క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రల్లో నటించే హరితేజ ‘బిగ్ బాస్’ షోతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయింది. తన మాటలు, ప్రవర్తన, పాటలతో అందరినీ ఆకట్టుకుంది. అదే క్రేజ్ తో ఆమెను అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే ‘ఫిదా’ అనే షోలో హరితేజ భాగమైంది. ఇప్పుడు మరో షో కోసం ఆమెను హోస్ట్ గా తీసుకోవాలని భావిస్తున్నారు. ఈటీవీలో ప్రసారమయ్యే ‘జబర్దస్త్’ షోకి మంచి పేరుంది. చాలా కాలంగా టాప్ రేటింగులతో ఈ షో దూసుకుపోతుంది. మొదట్లో అనసూయ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు రష్మీ హోస్ట్ చేస్తోంది.
ఇప్పుడు రష్మీ స్థానంలోకి హరితేజ రాబోతుందని సమాచారం. రష్మీకు బదులుగా హరితేజను తీసుకోవాలని కార్యక్రమ నిర్వాహకులు భావిస్తున్నారట. అయితే రష్మిను ఎవరు తప్పించలేదని, ఆమె స్వయంగా ఈ షో నుండి బయటకు వెళ్లాలనుకుంటున్నట్లు టాక్. ‘బిగ్ బాస్’ సెకండ్ సీజన్ లో పాల్గొనే వారి జాబితాలో రష్మీ పేరు కూడా ఉండడమే దీనికి కారణమని అంటున్నారు. ఆ గ్యాప్ ను పూర్తి చేయడానికి హరితేజను రంగంలోకి దింపుతున్నారు.