విడాకుల వార్తలపై హరితేజ స్పందన

నటి హరితేజ కెరీయర్‌ మంచి ఫిక్స్‌లో ఉన్నప్పుడు 2015లో దీపక్ అనే కన్నడ వ్యక్తిని హరితేజ పెళ్లాడింది. వీరికి భూమి అనే కూతురు ఉంది. తాజాగా తన భర్తకు హరితేజ విడాకులు ఇస్తోందనే వార్త సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ తో ఆమె ముచ్చటించే సందర్భంలో కూడా ఈ విషయం గురించి ఆమెను చాలా మంది డైరెక్ట్ గా అడిగేస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఆమె విడాకుల అంశంపై స్పందించింది. ఒక నాలుగు రోజులు సోషల్ మీడియాలో కనిపించపోవడంతో ఏవేవో రాసేస్తున్నారని మండిపడింది. తాను, తన భర్త అన్యోన్యంగానే ఉన్నామని చెప్పింది. తన భర్తతో ఉన్న ఫొటోను షేర్ చేసింది. మరోవైపు తన స్నేహితులతో కలిసి హరితేజ ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తోంది. కూతురుని తన తల్లి వద్ద విడిచిపెట్టి ఆమె ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu