టాలీవుడ్ దర్శకుడు హరీశ్ శంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. పలు అంశాలపై ఆయన సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ గురించి ఓ ప్రముఖ వైద్య నిపుణుడి వీడియోను ఆయన షేర్ చేశారు. ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వీడియోలో సదరు వైద్యుడు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు.
ఈ వీడియోను షేర్ చేసిన హరీశ్ శంకర్… వైరస్ వ్యాప్తి పట్ల సామాన్య ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కోరారు. అయితే ఈ వీడియో పట్ల ఓ నెటిజెన్ సీరియస్ గా స్పందించారు. హరీశ్ శంకర్ బాధ్యతారాహిత్యంగా ప్రవర్తిస్తున్నారని… ఒమిక్రాన్ ఆందోళనను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.
ఈ వ్యాఖ్యలపై హరీశ్ ఘాటుగా స్పందించారు. ఒక వైద్య నిపుణుడు ప్రజల్లో ఆశలు పెంచే దిశగా మంచి గురించి చెప్పినా మీలాంటి స్టుపిడ్స్ నిరాశ చెందుతూనే ఉంటారని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Am glad that stupids like u disappointed because guys like u never wanna give a hope to people even when an expert says something good and also he insists on precautions repeatedly !! https://t.co/tD5v3m80C5
— Harish Shankar .S (@harish2you) January 8, 2022