HomeTelugu TrendingHarish Shankar :కెమెరామెన్‌కి దర్శకుడు హరీష్‌ శంకర్‌ వార్నింగ్‌

Harish Shankar :కెమెరామెన్‌కి దర్శకుడు హరీష్‌ శంకర్‌ వార్నింగ్‌

Harish Shankar

Harish Shankar: దర్శకుడు హరీశ్​ శంకర్ తన గురించి సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడుకి వార్నింగ్‌ ఇచ్చాడు. తనను మళ్లీ కెలుక్కుంటే any day any platform I AM WAITING అంటూ ఘాటుగానే బదులిచ్చారు. అసలేం జరిగిందంటే?.. ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘రామయ్య వస్తావయ్యా’ సినిమా షూటింగ్ టైమ్‌లో జరిగిన విషయాలను ఆ చిత్రానికి సినిమాటోగ్రాఫర్​గా పనిచేసిన ఛోటా కె నాయుడు తాజా​గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

షూటింగ్ సమయంలో హరీశ్​ తన పనిలో జోక్యం చేసుకునేవారని, ఎంత నచ్చచెప్పాలని ప్రయతించినా వినలేదని కామెంట్ చేశారు ఛోటా కే నాయుడు. చివరకు హరీశ్​కు నచ్చినట్లుగానే పనిచేయాల్సి వచ్చిందని, తనకు కోపం వచ్చినా తర్వాతి నిమిషంలో డైరెక్టర్​కు స్క్రిప్ట్ మీద మరింత అవగాహన ఉంటుంది అని సర్దుకున్నట్లు తెలిపారు. అయితే ఈ ఇంటర్వ్యూలో ఛోటా మాట్లాడిన మాటలు దర్శకుడు హరీశ్​కు తీవ్రంగా కోపం తెప్పించాయి.

దీంతో హరీశ్ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్​లో ఛోటాను ప్రస్తావిస్తూ ఒక పోస్ట్ పెట్టారు. అందులో.. “వయసులో పెద్ద కాబట్టి” గౌరవనీయులైన చోటా కె నాయుడు గారికి నమస్కరిస్తూ.. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు దశాబ్దం దాటింది. ఈ పదేళ్లలో ఉదాహరణకు మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చి ఉంటా కానీ ఎప్పుడూ ఎక్కడా కూడా నీ గురించి నేను తప్పుగా మాట్లాడలేదు.

Harish Shankar warning to 1 Harish Shankar,Chota K. Naidu,Ramaiya Vastavaiya,ntr,gabbar singh

మీరు మాత్రం నా గురించి అవమానంగా మాట్లాడుతూనే ఉన్నారు. మీకు గుర్తుందో లేదో ఓ సందర్భంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామెన్​తో షూటింగ్ చేద్దాం అన్న ప్రస్తావన కూడా వచ్చింది. కానీ రాజుగారు చెప్పడం మూలంగానో గబ్బర్ సింగ్ వచ్చాక పొగరుతో పెద్ద కెమెరామెన్​ను తీసేస్తున్నాడు అని పదిమంది పలు రకాలుగా మాట్లాడుకుంటారని మథనపడుతూనే మీతో సినిమా పూర్తి చేశా.

ఆ సినిమా ఆశించిన విజయం సాధించకున్నా ఏ రోజు ఆ నింద మీ మీద మోపలేదు ఎందుకంటే “గబ్బర్ సింగ్” వచ్చినప్పుడు నాది “రామయ్య వస్తావయ్య” వస్తే అది నీది అనే క్యారెక్టర్ కాదు నాది. మీరు మాత్రం ఇంటర్వ్యూ చేసే వ్యక్తి అడగకపోయినా, నా ప్రస్తావన రాకున్నా నాకు సంబంధం లేకున్నా నా గురించి అవమానకరంగా మాట్లాడుతున్నారు.

ఇలా చాలాసార్లు జరిగినా నేను మౌనంగానే బాధపడ్డా కానీ నా స్నేహితులు అవ్వచ్చు లేదా నన్ను అభిమానించే వాళ్ళు అవ్వచ్చు నా ఆత్మ అభిమానాన్ని ప్రశ్నిస్తుండడంతో ఈ మాత్రం రాయాల్సి వస్తుంది. మీతో పని చేసిన అనుభవం నన్ను బాధపెట్టినా, మీకున్న అనుభవంతో నేను కొన్ని విషయాలు నేర్చుకున్నాను అందుకే మీరంటే ఇంకా నాకు గౌరవం ఉంది దయచేసి ఈ గౌరవాన్ని కాపాడుకోండి.

ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి. కాదు కూడదు మళ్లీ ఇలానే చేస్తానని అంటే any day any platform I AM WAITING -భవదీయుడు హరీష్ శంకర్” అని ఛాలెంజ్ చేశారు. అయితే ఇది చోటా కే నాయుడు ఇటీవలే ఇచ్చిన ఇంటర్వ్యూనా లేక పాతదా అనే క్లారిటీ పూర్తిగా లేకపోయినా.. ఈ మ్యాటర్ దర్శకుడి దాకా వెళ్లడంతో రచ్చ తెరమీదకు వచ్చింది. ఇలా జరగడం ఇది మొదటిసారి కాదంటున్న హరీష్ శంకర్ మాటలకు తిరిగి చోటా కె నాయుడు స్పందిస్తారో లేదో చూడాలి.ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్​గా మారింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu