డైరెక్టర్ హరీశ్ శంకర్‌కి మాస్ సినిమాపై మంచి పేరు వుంది. ఆయన నుంచి ఇటీవల వచ్చిన ‘గద్దలకొండ గణేశ్’ కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పటి నుంచి హీరోలకి కథలను వినిపిస్తూ తన ప్రయత్నాలను తను చేస్తూనే వున్నాడు. అయితే యంగ్ హీరో వరుస ప్రాజెక్టులతో బిజీగా వున్నారు. అందువలన వాళ్లకి తీరుబడి కావడానికి చాలా సమయం పడుతుంది.
ఈ నేపథ్యంలో అఖిల్ పై హరీశ్ శంకర్ దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత సినిమాకి గాను ఆయన ఎవరికీ ఓకే చెప్పలేదు. సో.. అఖిల్ ను ఒప్పించే ప్రయత్నంలో హరీశ్ శంకర్ ఉన్నాడనే వార్తలు.. ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది. కథ నచ్చి, అఖిల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతోనే హరీశ్ శంకర్ సినిమా ఉంటుందన్న మాట.