Harish Shankar – Pawan Kalyan Movie:
మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయం కాబోతోంది. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన రెయిడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా.. ఈ చిత్రం తెరకెక్కనుంది.
ఇప్పటికే విడుదలైన మిస్టర్ బచ్చన్ టీజర్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి అంచనాల మధ్య ఈ చిత్రం ఆగస్టు 15న విడుదల కి సిద్ధం అవుతుంది. మరోవైపు హరీష్ శంకర్ సినిమాని భారీ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా కంటే ముందే హరి శంకర్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా చేయాల్సి ఉంది.
అదే ఉస్తాద్ భగత్ సింగ్. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ అవడంతో.. ఈ సినిమా సైడ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఫ్రీ అవ్వగానే సినిమా మళ్లీ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్ సమయంలో.. హరీష్ శంకర్ కి వస్తాద్ భగత్ సింగ్ సినిమాకి సంబంధించిన ప్రశ్న ఎదురైంది. దానికి హరీష్ శంకర్ ఇచ్చిన జవాబు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
“ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ.. జీవితం మొత్తం గుర్తుంచుకునేలా మంచి జ్ఞాపకాలు ఇస్తుంది. ఎలా అయితే మనం పాటల క్యాసెట్లు, డివిడిలు దాచుకుంటామో.. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమాని ఎప్పుడు మనసులో గుర్తుంచుకుంటారు” అని హరీష్ శంకర్ ఇచ్చిన హైప్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
హరీష్ శంకర్ ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సినిమాపై అంచనాలు ఇంకా పెరిగాయి. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని అభిమానులు ఇంకా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. సమయం కుదిరినప్పుడు సినిమా షూటింగ్ లను మొదలు పెట్టబోతున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ వంటి ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి.