HomeTelugu Trending'వాల్మీకి' పై వివాదం

‘వాల్మీకి’ పై వివాదం

2 5‘వాల్మీకి’ సినిమాలో హీరో వరుణ్‌తేజ్‌ పేరు వాల్మీకి కాదని దర్శకుడు హరీష్‌ శంకర్‌ స్పష్టం చేశారు. ఈ సినిమా టైటిల్‌పై అనంతపురానికి చెందిన వాల్మీకి సంఘం అభ్యంతరం వ్యక్తం చేయడం పట్ల ఆయన స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌ వేదికగా మాట్లాడుతూ.. వాల్మీకిని పూజించిన రాముడు కూడా ధర్మం కోసం ఫైటింగ్‌ చేశాడు. ఏదేమైనప్పటికీ మేం వాల్మీకి సంఘం అభిప్రాయాల్ని గౌరవిస్తాం. ఈ సినిమాలో హీరో పేరు వాల్మీకి కాదని ముందే చెబుతున్నా. కాబట్టి గొప్ప వాల్మీకి పేరును మా హీరోకు పెట్టలేదు’ అని హరీష్‌ ట్వీట్లు చేశారు.

డబ్బు కోసం ఫైటింగ్‌ సినిమాకు ‘వాల్మీకి’ పేరు పెట్టడాన్ని సహించబోమని అనంతపురం వాల్మీకి రిజర్వేషన్‌ పోరాట సమితి ఉపాధ్యక్షుడు లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు స్థానిక సీఐకి లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. తమిళనాడుకు చెందిన ఓ కథ ఆధారంగా తీసిన సినిమాను తెలుగులో ‘వాల్మీకి’ టైటిల్‌తో తీయడం సరికాదని పేర్కొన్నారు. సందేశాత్మక చిత్రానికి కాకుండా రౌడీ మూకల సినిమాకు ఇలాంటి టైటిల్ పెట్టడాన్ని ఖండించారు. వెంటనే సినిమా టైటిల్‌ మార్చకపోతే ఆందోళన చెస్తామని హెచ్చరించారు. దర్శకుడు, నిర్మాతలపై సెక్షన్‌ 295 (ఎ) ప్రకారం చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

‘వాల్మీకి’ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్నారు. 14 రీల్స్‌ ప్లస్‌ సంస్థ దీనిని నిర్మిస్తోంది. మిక్కీ జే మేయర్‌ బాణీలు అందిస్తున్నారు. తమిళ సినిమమా ‘జిగర్తాండ’ కు తెలుగు రీమేక్‌ ఇది. సెప్టెంబరు 6న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu