దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘దువ్వాడజగన్నాథం’ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. కొద్ది గంటల్లోనే ఈ టీజర్ ఐదు మిలియన్ వ్యూస్ ను సాధించి దూసుకుపోతుంది. కానీ ఈ టీజర్ కు ఎక్కువగా డిస్ లైక్స్ వస్తుండడంతో కావాలనే యాంటీ ఫ్యాన్స్ ఇలా చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ
విషయంపై హరీష్ కూడా బాగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. దాని కారణంగానే ‘నిప్పులు చిమ్ముతూ నింగికి నే ఎగిరిపోతే నిమిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్ధాక్షిణ్యంగా వీరే..’ అంటూ శ్రీశ్రీ రాసిన ఒక కవితను పోస్ట్ చేశాడు. అంతేకాదు ఈ పోస్ట్ కి ‘యధ్భావం తధ్భవతి’ అని యాడ్ చేయడంతో హరీష్ ఈ విషయం పట్ల ఎంతగా బాధ పడ్డాడో అనే విషయం స్పష్టం అవుతోంది. ఇకనైనా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ఫ్యాన్స్ చేస్తోన్న వార్ తగ్గుముఖం పడుతుందేమో చూడాలి!