నటుడు త్రిగున్ నటిస్తున్న తాజాగా చిత్రం “కిరాయి”. వీఆర్‌కే డైరెక్షన్‌లో అమూల్య రెడ్డి యలమూరి, నవీన్ రెడ్డి వుయ్యూరులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గతంలో గుంటూరు, పల్నాడులలో ఎక్కువగా కిరాయి హత్యలు జరిగేవి. ఈ హత్యల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రోజు(జూన్ 8) హీరో త్రిగున్ బర్త్ డే సందర్బంగా డైరెక్టర్ హరీష్ శంకర్ “కిరాయి” ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఈ సందర్బంగా డైరెక్టర్ హరీష్ శంకర్ మాట్లాడుతూ.. ‘త్రిగున్ నాకు చాలా కాలం నుంచి తెలుసు. తను చాలా ఎనర్జిటిక్ హీరో. గతంలో లవ్, కామెడీ వంటి మంచి మంచి సినిమాలు చేశాడు. తను మొదటి సారిగా డిఫరెంట్ సబ్జెక్టు అటెంప్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరుతున్నాను’ అన్నారు.
చిత్ర దర్శకుడుV. R. K,(రామకృష్ణ) మాట్లాడుతూ.. ‘ఇందులో హీరో కిరాయి తీసుకోకుండా కిరాయిహత్య చేయవలసి వస్తుంది. అలా ఎందుకు చేయవలసి వచ్చింది. ఇలా వరుస హత్యలు ఎందుకు చేస్తారు. ఈ క్రమంలో వారి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేదే ఈ కథ. రీసెంట్‌గా ఈ సినిమా రష్ & ఫస్ట్ లుక్ చూసిన రామ్ గోపాల్ వర్మ చాలా బాగుందని మెచ్చుకోవడం హ్యాపీగా ఉంది. ఇందులో యాక్షన్ మాములుగా ఉండదు. ఒక ట్రాన్స్‌ఫారం బద్దలయితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది’ అన్నారు.