Mr Bachchan Trailer:
వరుస డిజాస్టర్ లతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం తన ఆశలన్నీ మిస్టర్ బచ్చన్ సినిమా మీదే పెట్టుకున్నారు. హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా తెరకెక్కిన తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ ఒక ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ పాత్ర లో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన చిత్ర ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
రీమేక్ అయినప్పటికీ హరీష్ శంకర్ ఈ సినిమాలో బాగానే కమర్షియల్ ఎలిమెంట్లు దట్టించి పెట్టినట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న భాగ్యశ్రీ బోర్సే, రవితేజ మధ్య వయసు తేడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సినిమాకి సంబంధించిన పోస్టర్ల విడుదల సమయం నుంచి.. హీరోయిన్ ను గ్లామరస్ గా చూపిస్తూ వచ్చింది చిత్ర బృందం.
కానీ తనకంటే చాలా వయసులో చాలా చిన్నదైన భాగ్యశ్రీ తో రవితేజ రొమాన్స్ చేయడం.. కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో కొందరు రవితేజని తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ ట్రోల్స్ కి డైరెక్టర్ హరీష్ శంకర్ రియాక్ట్ అయ్యారు.
“మన ఇంట్లో అమ్మాయికి పెళ్లి చేస్తున్నప్పుడు వయసు మాత్రమే కాదు అన్నీ చూసుకుంటారు. అందులో తప్పులేదు. కానీ ఇది నిజ జీవితం కాదు సినిమా. ఇందులో హీరో పక్కన నటించే హీరోయిన్ విషయంలో ఎందుకు ఇన్ని అభ్యంతరాలు? చేస్తున్న అమ్మాయికి లేని అభ్యంతరం చూసేవాళ్ళకి ఎందుకు? ఆమె ఇష్టపూర్వకంగానే సినిమాకు సైన్ చేసింది సినిమాలో నటించింది. మధ్యలో మీ బాధ ఏంటి? సినిమా అంటేనే కల్పితం. ఇందులో వాళ్ళు చేసేది కేవలం నటన మాత్రమే. సినిమాలో హీరో స్వభావం చూడాలి కానీ వయసెంత అని కాదు. ధమాకా విషయంలో కూడా అలాగే అన్నారు కానీ సినిమా సూపర్ హిట్ అయింది. ఒకప్పుడు ఎన్టీఆర్, శ్రీదేవి లను కూడా ఇలానే మాటలు అన్నారు కానీ వాళ్ల సినిమాలు కూడా సెన్సేషనల్ హిట్లు అయ్యాయి. సోషల్ మీడియాలో మాట్లాడే వాళ్లు మాత్రమే ఇవన్నీ చూస్తారు కానీ.. బయట జనాలు సినిమా బాగుందా లేదా అని మాత్రమే చూస్తారు” అని కామెంట్ చేశారు చెప్పుకొచ్చారు హరీష్ శంకర్.
హరీష్ శంకర్ అన్న దాంట్లో తప్పేమీ లేదు. నిజానికి రవితేజ విషయంలో మాత్రమే కాదు ఇండస్ట్రీలో ఉన్న మిగతా సీనియర్ హీరోల విషయంలో కూడా ఇదే జరుగుతూ ఉంది. 60 ఏళ్లు పైబడిన హీరోలు కూడా 20 ఏళ్ల హీరోయిన్లతో రొమాన్స్ చేస్తున్నారు అంటూ చాలా కామెంట్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే కొందరు మాత్రం సినిమానే సినిమా లాగా మాత్రమే చూడాలి అని.. ఈ ట్రోల్స్ ని కొట్టి పారేస్తూ ఉంటారు.