Mr Bachchan review:
మాస్ మహారాజా రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా Mr Bachchan షాక్ మిరపకాయ్ వంటి సినిమాల తరువాత మళ్లీ వీళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది. హిందీలో సూపర్ హిట్ అయిన రైడ్ సినిమాకి తెలుగు రీమేక్ గా ఈ చిత్రం ఇవాళ ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
విడుదల కి ముందు వరకు సినిమా మీద మంచి అంచనాలే ఉన్నాయి. పైగా చిత్ర బృందం సినిమాని బాగానే ప్రమోట్ చేశారు. పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ రవితేజ కూడా రీమేక్ సినిమాలు చేయాలంటే హరీష్ శంకర్ తర్వాతే ఎవరైనా అని అన్నారు. గతంలో కూడా ఈ సినిమా రీమేక్ ఆఫర్ వచ్చినా కూడా నో చెప్పాను అని.. హరీష్ శంకర్ వచ్చాకే సినిమాకి ఒప్పుకున్నాను అని అన్నారు. కానీ ఇప్పుడు సినిమా డిజాస్టర్ దిశగా పరుగులు తీస్తోంది.
హరీష్ శంకర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు రీమేక్ సినిమాలు చేయడం కష్టమే. కానీ రీమేక్ సినిమా అంటే ప్రేక్షకులు పూర్తి అన్నీ మార్చేసి.. సోల్ పోయేలాగా కథలో మార్పులు చేస్తే అది రీమేక్ అవదు అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో నిన్న మొన్నటిగాక రీమేక్ సినిమాలు అంటేనే హరీష్ శంకర్ అని అన్నారు. కానీ ఇప్పటిదాకా హరీష్ శంకర్ రీమేక్ చేసిన సినిమాలు రెండే రెండు. అందులో ఒకటి గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి గల కారణాల్లో ముఖ్యమైనది పవన్ కళ్యాణ్ పర్ఫామెన్స్ మాత్రమే.
ఇక రెండవ సినిమా గద్దలకొండ గణేష్. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా కనీసం వచ్చి వెళ్లినట్టు కూడా చాలామందికి గుర్తులేదు. ఇప్పుడు Mr Bachchan సినిమా కూడా ఫ్లాప్ అవ్వబోతోంది. దీంతో రీమేక్ సెంటిమెంట్ ఇప్పటికైనా మారిందా అంటూ ఫ్యాన్స్ ప్రశ్నలు విసురుతున్నారు. మరి ఇప్పటికైనా హరీష్ శంకర్ రీమేక్ సినిమాలు చేయడం ఆపుతారో లేదో చూడాలి.