Harish Shankar about Tollywood Heroes:
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రస్తుతం మిస్టర్ బచ్చన్ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా ఆగస్టు 15న భారీ అంచనాల మధ్య విడుదల కి సిద్ధం అవుతుంది హిందీలో రైడ్ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ట్రైలర్ కు ఇప్పటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హరి శంకర్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. ఇద్దరు హీరోలతో సినిమాలు చేయడం తనకి ఇష్టమైన అని అడిగితే Harish Shankar వెంటనే రెడీ అని చెప్పారు. రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి సినిమాలు చేస్తున్నారు నాటు నాటు పాట ఇప్పటికీ నా మైండ్ లోంచి పోవడం లేదు అని అన్నారు హరీష్ శంకర్.
ఈమధ్య అలాంటి కథలు రావడం లేదు అని అడగగా హరి శంకర్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సినిమా పోకడ ఇప్పుడు మారిపోయింది. అది హీరోలా తప్పు కాదు. మేము డైరెక్టర్లుగా మల్టీస్టారర్ కథలు రాయడం లేదు. మంచి కథలు దొరకకపోవడం వల్లే హీరోలు కూడా మల్టీ స్టార్ సినిమాలు చేయడం లేదు. అని అన్నారు హరీష్ శంకర్
మంచి కథ వస్తే మన తెలుగు హీరోలు ఎప్పుడూ మల్టీస్టారర్ సినిమా అని వెనుకడుగు వేయరని చెప్పినా హరీష్ శంకర్ తెలుగు హీరోల మధ్య ఉన్న ఐక్యత మరి ఇండస్ట్రీలోనూ ఉండదు అని అన్నారు. ఎన్టీఆర్ సినిమా ఆడియో ఫంక్షన్లకి మహేష్ బాబు గారు వచ్చిన సందర్భాలు ఉన్నాయి.. మహేష్ బాబు గారి ఈవెంట్లకి చిరంజీవి గారు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి అని గుర్తు చేశారు హరీష్ శంకర్.
ప్రస్తుతం హరీశ్ శంకర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంచి కథ వస్తే నిజంగానే తెలుగు హీరోలు మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి వెనకడుగు వేయరు. ఈ నేపథ్యంలోనే మంచి కథలు కథలు వచ్చి క్రేజీ మల్టీ స్టార్లర్ సినిమాలు చూడాలని అభిమానులు కూడా ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మాట వాస్తవమే.