Harish Shankar about Pawan Kalyan:
అల్లు మెగా కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నా.. వారికి మధ్య ఏదో ఒక గొడవ ఉంది అంటూ సోషల్ మీడియాలో చర్చ వినిపిస్తూనే ఉంటుంది. కానీ గత కొంతకాలంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ల వివాదం సోషల్ మీడియాలో నడుస్తూనే ఉంది. పవన్ కళ్యాణ్ కి కాకుండా అల్లు అర్జున్ వైసీపీ లీడర్ కి మద్దతుగా క్యాంపెయిన్ చేసినప్పటి నుంచి.. మెగా అభిమానులు బన్నీ మీద తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదంతా జరిగిపోయి నెలలు గడిచినా కూడా బన్నీ మీద ట్రోలింగ్ మాత్రం ఆగలేదు. అయితే తాజాగా నాగబాబు అల్లు అర్జున్ పుష్ప సినిమా కోసం ఎదురుచూస్తున్నట్టు కామెంట్లు చేసి.. ఇప్పుడు అంతా బాగానే ఉందా అని అనిపించేలా చేశారు. కానీ అది జరిగి కనీసం రెండు రోజులు కూడా కాలేదు కానీ అప్పుడే పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్ పుష్ప సినిమా మీద కామెంట్స్ చేశారు.
చెట్లు నరకడం హీరోయిజమా అంటూ పుష్ప సినిమా మీద ఇండైరెక్టుగా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీ అభిమానులు పవన్ కళ్యాణ్ సినిమా డైలాగులను ప్రశ్నిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ శంకర్ గతంలో పుష్ప సినిమా గురించి చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
“పుష్ప సినిమా చూసి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ లాప్టాప్ లు వదిలేసి గొడ్డళ్లు పట్టుకుని తిరుపతి వెళ్ళిపోయారా? బన్నీ ఫాన్స్ కూడా గొడ్డలి పట్టుకుని నరికేసి డబ్బులు సంపాదిస్తున్నారా? ఏదేమైనా ఆ సినిమా ని సినిమా లాగానే చూడాలి” అని అన్నారు హరీష్ శంకర్.
ఇది పాత వీడియో అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా బన్నీ ఫాన్స్ వాడేస్తున్నారు. మరోవైపు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన మిస్టర్ బచ్చన్ సినిమా ఈనెల 15వ తేదీన విడుదల కాబోతోంది.