సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘ఎన్టీఆర్’ జీవిత కథ ఆధారంగా ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వర్మ తనదైన స్టైల్‌లో చేస్తున్నాడు. వరుసగా పాత్రలను పరిచయం చేస్తున్న వర్మ పేర్లు వెల్లడించకుండానే ఆ స్టిల్స్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాడు.
తాజాగా షూటింగ్‌కు సంబంధించి మరికొన్ని స్టిల్స్‌ను రిలీజ్ చేసిన వర్మ, మరోసారి ఆసక్తికర చర్చకు తెర లేపాడు. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో ఈ పాత్ర ఎవరిది.?’ అంటూ ఓ స్టిల్‌ను పోస్ట్‌చేశాడు వర్మ. దీనిపై స్పందించిన నెటిజెన్స్ ఈ క్యారెక్టర్ హరికృష్ణదే అంటూ రిప్లై ఇస్తున్నారు. మరో ఫొటోలో హరికృష్ణతో పాటు బాలకృష్ణ, ఇతర ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నట్టుగా నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాపై ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు కేసులు వేయడం, వర్మకు నోటీసులందడం కూడా జరిగింది.