సినీయర్ నటి, కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీనటుడు మహేష్ బాబు ఆమెకు విషెస్ తెలిపారు. ‘పుట్టినరోజు శుభాకాంక్షలు విజయశాంతి గారు. మీరు ఎల్లప్పుడు పూర్తి ఆరోగ్యంతో, సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు ట్వీట్ చేశారు. దీనికి ఆమె ‘థ్యాంక్యూ సూపర్ స్టార్ మహేశ్ బాబు గారు’ అంటూ రిప్లై ఇచ్చారు.
కాగా, విజయశాంతికి పలువురు సినీ ప్రముఖులు కూడా శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే విజయశాంతి గారు. మీరు నటించే సినిమాలకు మీరే ఓ గొప్ప సంపదలా కనపడతారు. సరిలేరు నీకెవ్వరు సినిమాకు మీరందించిన సహకారాన్ని వివరించడానికి పదాలు సరిపోవు’ అని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. ఈ సందర్భంగా ఆమెతో తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు.
Thank you Super Star Mahesh Babu garu. https://t.co/YGIv5OVhGt
— VijayashanthiOfficial (@vijayashanthi_m) June 24, 2020