నేడు నటి సంగీత పుట్టిన రోజు. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన సంగీత 2009లో సింగర్ క్రిష్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం సంగీత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో తిరిగి టాలీవుడ్లో అడుగు పెట్టింది సంగీత. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో సంగీతకు అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్‌లోనూ పాల్గొంటోంది. ఖడ్గం చిత్రంలో ఒకే ఒక్క ఛాన్స్ డైలాగ్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించింది. ఫ్యామిలీ హీరోయిన్‌గానే కాకుండా గ్లామరస్ నటిగాకూడా గుర్తింపు పొందింది.