టాలీవుడ్ సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పుట్టినరోజు నేడు. ఆయన తెరకెక్కించిన ఈ సినిమా ఒకదానికి మించి మరో సినిమా శతదినోత్సవాలు జరుపుకునేవి. అనేక పౌరాణిక .. జానపద .. చారిత్రక సినిమాలను చేసిన ఎన్టీఆర్ ఆ తరువాత తరంలో ఎక్కువ సాంఘిక చిత్రాలను చేసింది రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే కావడం విశేషం. అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం అందుకు నిదర్శనం. ఇక అక్కినేనితో ప్రేమకానుక చేసి అయన అభిమానులను మెప్పించారు.
శోభన్ బాబుతో చేసిన దేవత .. కృష్ణతో చేసిన అగ్నిపర్వతం .. కృష్ణంరాజుతో చేసిన త్రిశూలం వాళ్ల కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. ఇక చిరంజీవితో జగదేకవీరుడు అతిలోక సుందరి. బాలకృష్ణతో అపూర్వ సహోదరులు. నాగార్జునతో ఆఖరి పోరాటం. వెంకటేశ్ తో కూలీ నెంబర్ 1. మోహన్ బాబుతో అల్లుడు గారు ,తిరుగు లేని విజయానికి అర్ధం చెప్పాయి. ఇక హీరోయిన్ ఓరియంటడ్ మూవీస్ జ్యోతి, కల్పన, పదహారేళ్ల వయసు సినిమాలను ప్రేక్షకులు ఈనాటికీ మరిచిపోలేదు.
హీరోయిన్ రాఘవేంద్రరావు మాదిరిగా అందంగా చూపించడం మరొకరికి సాధ్యం కాదని చెప్పుకునేవారు. అలాంటి రాఘవేంద్రరావు .. భక్తిరస భరితమైన శ్రీమంజునాథ, శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం విశేషం. అలా 1975లో తెలుగు తెరపై మొదలైన ఆయన ప్రయాణం దశాబ్దలుగా సాగుతూనే ఉంది. 100 సినిమాలకి పైగా దర్శకత్వం వహించిన ఆ దర్శకేంద్రుడికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.