HomeTelugu Big Storiesహాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

హాస్యబ్రహ్మాకు పుట్టినరోజు శుభాకాంక్షలు

Brahmanandam2

నవ్వుల రారాజు.. హాస్యబ్రహ్మ… బ్రహ్మానందం పుట్టినరోజు నేడు. కన్నెగంటి బ్రహ్మానందం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్.. సత్తెనపల్లిలో 1956 ఫిబ్రవరి 1న జన్మించారు. విద్యాభ్యాసం తరువాత అత్తిలిలో తెలుగు లెక్చరర్‌గా పనిచేస్తున్న ఆయన టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడు జంధ్యాల డైరెక్షన్‌లో పరిచయమైయ్యారు. నటుడిగా బ్రహ్మానందంగా అరంగేట్రం చేసింది, తొలి వేషం వేసిందీ కూడా ఫిబ్రవరి 1వ తేదీనే కావడం విశేషం. నరేష్ హీరోగా నటించిన తాతావతారం మూవీలో నటించారు. ఆ తరువాత జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ఎవరగ్రీన్‌ క్లాసిక్‌ ‘అహానా పెళ్లంట’ సినిమాలో అరగుండు బ్రహ్మానందంగా పండించిన హాస్యానికి జనం విరగబడి నవ్వారు. ఇక అది మొదలు తనదైన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి.. కెరియర్‌కు తిరుగులేని బాట వేసుకున్నారు.

Brahmanandam1

దర్శక, నిర్మాతలకే కాకుండా.. టాప్‌ హీరోలకు కూడా బ్రహ్మానందం ఫ్యావరేట్‌గా మారిపోయాడు. అరగుండు, కిల్ బిల్ పాండే, కత్తి రాందాస్‌, ఖాన్ దాదా, శంకర్ దాదా ఆర్ ఎంపి, నెల్లూరి పెద్దారెడ్డి, గ‌చ్చిబౌలి దివాక‌ర్‌, లవంగం, భట్టు , మైఖెల్ జాక్సన్‌, ప‌ద్మశ్రీ‌, ప్రణ‌వ్‌, జ‌య‌సూర్య లాంటి పాత్రల్లో నటించి కామెడీ పండించారు. అలాగే అలనాటి హీరోలు మొదలుమొత్తం మూడు తరాల వారితో కలిసి కామెడీ పండించిన భాగ్యం దక్కిన ఏకైక హాస్యనటుడు బ్రహ్మానందం. అంతేకాదు ఆయన గొప్ప మిమిక్రీ ఆర్టిస్టు కూడా.

Brahmanandam3

మరోవైపు సోషల్‌ మీడియాలో బ్రహ్మానందంకు మంచి ఫాలోయింగ్‌ ఉంది. సందర్భం ఏదైనా బ్రహ్మానందం ఇమేజ్‌లేని మీమ్స్‌ లేవంటే అతిశయోక్తి లేదు. బ్రహ్మానందం పలికించిన హావభావాల ప్రాధాన్యత పాపులారిటీ అలాంటి. జంబలకిడి పంబ, చిత్రం భళారే విచిత్రం, మనీ, వినోదం అనగనగ ఓ రోజు, మన్మధుడు, అతడు, దూకుడు, అదుర్స్‌, రేసుగుర్రం ఇలా.. జాతిరత్నందాకా ఆయన సినీ ప్రస్థానం అప్రతిహతంగా కొనసాగింది. ఏకంగా ఐదు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. ఆయన విశిష్ట సేవలను గురించిన భారత ప్రభుత్వం 2010లో పద్మ శ్రీ పురస్కారంతో సత్కరించింది. ఒక ఫిలిమ్ ఫేర్ అవార్డు సైతం అందుకున్నాడు. అలాగే 2005లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం బ్రహ్మానందానికి గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. వివిధ భాషలలో 1250కి పైగా సినిమాలలో నటించి 2010 లో గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఇక ఈ మధ్య కాలంలో సినిమాలు తగ్గించిన బ్రహ్మానందం తనలోని మరో కళాలో నైపుణ్యాన్ని చాటుకుంటున్నారు. అద్భుత పెన్సిల్‌ స్కెచ్‌లతో ఫ్యాన్స్‌తో ఆశ్చర్య పరుస్తున్నారు. హాస్యబ్రహ్మ బ్రహ్మానందంకు క్లాప్‌బోర్డు హృదయపుర్వకంగా.. పుట్టినరోజు శుంభాకాంక్షలు తెలియజేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu