HomeTelugu Trendingసితార బర్త్‌డే.. మహేష్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

సితార బర్త్‌డే.. మహేష్‌ బాబు ఎమోషనల్‌ పోస్ట్‌

6 19సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు తన ముద్దుల కుమార్తె సితారకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు చెప్పారు. చిన్నారి ఏడో జన్మదినం సందర్భంగా పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకూ ప్రతి ఏడాది తీసిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ‘హ్యాపీ బర్త్‌డే సితార (లవ్‌ సింబల్స్‌). కాలం చాలా వేగంగా పరుగులు తీస్తోంది. నీతో గడిపిన ప్రతి క్షణం నాకు ఎంతో ప్రత్యేకం. నీ జీవితం ప్రేమ, సంతోషం, పాజిటివిటీతో నిండాలని కోరుకుంటున్నా. ఆ దేవుడి ఆశీర్వాదాలు నీకెప్పుడూ ఉంటాయి. నువ్వు ఊహించిన దానికంటే ఇంకా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నా’ అని మహేశ్‌ ఎమోషన్‌తో పోస్ట్‌ చేశారు.

ఇదే సందర్భంగా నమ్రత కూడా సితారను విష్‌ చేశారు. ‘నా పాపకు ఏడేళ్లు. జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు ఓ అందమైన మహిళగా ఎదగాలని కోరుకుంటున్నా. నీదైన మార్గంలో నడుస్తూ.. సరైన నిర్ణయాలు తీసుకో. నీ కోసం కుటుంబం ఎప్పుడూ నీ వెంటే ఉంటుందనే సంగతి గుర్తుపెట్టుకో’ అని పేర్కొన్నారు. నమ్రత, సితార, గౌతమ్‌ ప్రస్తుతం కశ్మీర్‌లో ఉన్నారు. సితార బర్త్‌డే సందర్భంగా వీరంతా అక్కడికి వెళ్లారు. మహేష్‌ శుక్రవారం ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా కశ్మీర్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu