టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని బర్త్‌డే ఈ రోజు (మే 15). రామ్ టాలీవుడ్‌లో (2006) దేవదాస్ సినిమాతో పరిచయం అయ్యాడు. తొలి సినిమాలోనే రామ్ తన నటనతో అదరగొట్టాడు. తన నటన, డ్యాన్స్‌కు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్‌తో రామ్‌కి తెలుగులో వరుసగా ఆఫర్లు వచ్చాయి. అయితే రామ్ మాత్రం కథలను ఆచితూచి ఎంచుకున్నాడు. రెండో చిత్రం ‘జగడం’ ప్లాపును మూట గట్టుకున్నప్పటికీ.. రామ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘రెడీ’ చేసి బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు. అయితే ఆ తర్వాత రామ్‌కి పెద్దగా హిట్లు లభించలేదు. అతను నటించిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదు అనిపించాయి.
ఇక 2019లో పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రామ్ నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా గ్రాండ్ సక్సెస్‌ని మూటగట్టుకుంది. ఈ చిత్రం ద్వారా తన బాక్సాఫీస్ పవర్‌ను 100 కోట్ల చేర్చాడు ఈ ఇస్మార్ట్ హీరో. ఇక ‘ఇస్మార్ట్ శంకర్’తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఈ ఏడాది ‘రెడ్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో అతను తొలిసారిగా ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇలాగే సినీ కేరీర్ రామ్ దూసుకెళ్తూ మరిన్ని రికార్డుకు క్రియేట్ చేయాలని ‘సాక్షి’ తరపున ఆయనకు బర్త్‌డే విషెష్ అందజేస్తుంది.